MLA Car Sticker Controversy: ఏపీలో తెలంగాణ ఎమ్మెల్యే కారు స్టిక్కర్ కలకలం..
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:24 PM
వినాయక చవితి సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ మీటింగ్‌కు తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్టిక్కర్ ఉన్న స్కార్పియో వాహనంలో ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటం, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో అనుమానంతో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.
శ్రీసత్యసాయి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనం హల్‌చల్ చేసింది. ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న స్కార్పియో వాహనంపై తెలంగాణ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. AP 40 BY 4567 అనే ఫ్యాన్సీ నెంబర్‌తో తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కారులో హాకీ స్టిక్స్ కూడా గుర్తించినట్లు చెన్నేకొత్తపల్లి పోలీసులు వెల్లడించారు.
వినాయక చవితి సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ మీటింగ్‌కు గడ్డం ప్రసాద్ కుమార్ స్టిక్కర్ ఉన్న స్కార్పియో వాహనంలో ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కారుకు బ్లాక్ ఫిల్మ్‌తోపాటు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో అనుమానం వచ్చి తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. కారు కూడా తెలంగాణకు చెందినదిగా నిందితులు చెప్తున్నట్లు తెలిపారు. కానీ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం ఏపీకి చెందినదిగా గుర్తించినట్లు వెల్లడించారు.
కారు సేవాలాల్ నాయక్ అనే వ్యక్తి వాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. కార్లోని హాకీ స్టిక్స్‌తో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. కారు సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఏపీలో తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు తిరగడంతో.. ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే వారికి ఆ స్టిక్కర్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎన్ని రోజులుగా ఆ స్టిక్కర్‌తో కారుని నడుపుతున్నారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:
ప్రాణం తీసిన ప్రేమ.. ఏం జరిగిందంటే..
రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలే.. వానలు
For More Telangana News and Telugu News..