Share News

Anantapur: ప్రాణం తీసిన ప్రేమ.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:38 PM

ప్రేమ.. యువతి ప్రాణాలు బలి తీసుకుంది. ‘మా ప్రేమకు నువ్వే అడ్డుగా ఉన్నావ్‌. నువ్వే చనిపోతే... ఇబ్బందులు తొలగిపోతాయ్‌’ అంటూ ప్రేమికులు.. స్వాతిని సూటి పోటి మాటలతో వేధించారు. దీంతో 22 ఏళ్ల స్వాతి తను ఉంటున్న స్థానిక సాయినగర్‌లోని హాస్టల్‌ గదిలోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Anantapur: ప్రాణం తీసిన ప్రేమ.. ఏం జరిగిందంటే..

- సూటిపోటి మాటలతో మనస్తాపం..

- స్వాతి ఆత్మహత్య

అనంతపురం: ప్రేమ.. యువతి ప్రాణాలు బలి తీసుకుంది. ‘మా ప్రేమకు నువ్వే అడ్డుగా ఉన్నావ్‌. నువ్వే చనిపోతే... ఇబ్బందులు తొలగిపోతాయ్‌’ అంటూ ప్రేమికులు.. స్వాతిని సూటి పోటి మాటలతో వేధించారు. దీంతో 22 ఏళ్ల స్వాతి తను ఉంటున్న స్థానిక సాయినగర్‌లోని హాస్టల్‌ గదిలోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చే స్తున్నారు. సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


acci1.2.jpg

శ్రీసత్యసాయి(Sri Satyasai) జిల్లా పెనుకొండ మండలం గొందిపల్లికి స్వాతి నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతుండేది. సాయినగర్‌లోని దీపు బ్లడ్‌ బ్యాంకులో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా కూడా పనిచేస్తుండేది. అక్కడే ల్యాబ్‌ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న అరుణ్‌.. మరో యు వతి ప్రతిభా భారతిని ప్రేమిస్తున్నాడు. అరుణ్‌ ఆమెతోపాటు, స్వాతిని కూడా ప్రేమించాడు. ప్రతిభా భారతి విషయం తెలుసుకుని స్వాతి దగ్గరకు వచ్చి... ‘నేను, అరుణ్‌ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం, మా ప్రేమకు నువ్వే అడ్డువస్తున్నావ్‌.


ఈ విషయాన్ని ల్యాబ్‌లో, హాస్టల్‌లో చెబుతా. ను వ్వు చనిపోతే... మాకు ఇబ్బందులు తొలగుతాయి’ అంటూ హెచ్చరించింది. దీంతో స్వాతి మనస్తాపం చెంది ఉదయం 7.30 గంటలకు తాను ఉంటున్న బాలాజీ హాస్టల్‌లో తన చున్నీతోనే ఉరివేసుకుంది. గమనించిన స్నేహితులు.. ఆమెను ప్రభుత్వాసుత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి పూజారి నాగభూషణం ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 26 , 2025 | 02:02 PM