Woman Funny Viral Video: బురద మీద పడిందని బుద్ధి చెప్పింది.. ఈ మహిళ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Oct 31 , 2025 | 10:16 AM
ఓ మహిళ రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుంటుంది. రోడ్డు మొత్తం బురద బురదగా ఉండడంతో అడుగులో అడుగు వేసుకుంటూ ఎంతో జాగ్రత్తగా నడుస్తుంటుంది. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న బురద ఎగిరి సదరు మహిళపై పడింది. బురద మీద పడగానే షాకైన మహిళ.. ఆ కారు డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహానికి గురైంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
వర్షాకాలంలో అంతా రోడ్డుపై నడుస్తూ వెళ్లే సమయంలో మీద బురద పడే సమస్యను ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటుటారు. ఇలాంటి సమయాల్లో సదరు వాహనదారులను కసితీరా తిట్టుకుని, చివరకు నీళ్లతో కడుక్కుని సర్దుకుపోతుంటారు. ఇంతకుమించి ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ మహిళకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీద బురద పడిందనే కోపంతో చివరకు ఆమె చేసిన పని.. అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుంటుంది. రోడ్డు మొత్తం బురద బురదగా ఉండడంతో అడుగులో అడుగు వేసుకుంటూ ఎంతో జాగ్రత్తగా నడుస్తుంటుంది. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న బురద ఎగిరి సదరు మహిళపై పడింది. బురద మీద పడగానే షాకైన మహిళ.. ఆ కారు డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే రోడ్డు పక్కన ఉన్న రాయి తీసుకుని కారుపై దాడి చేయాలని చూస్తుంది. అయితే అప్పటికే కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అయినా ఆమె మాత్రం ఎలాగైనా కారు యజమానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. దీంతో కారు తిరిగి వచ్చే వరకూ అక్కడే ఎదురు చూసింది. కాసేపటి తర్వాత ఆ కారు మళ్లీ అటుగా వచ్చింది. ఆమె రోడ్డు మధ్యలో రాయి పట్టుకుని నిలబడి ఉండడంతో వాహనాన్ని ఆపాల్సి వచ్చింది. కారును ఆపగానే దగ్గరికి వెళ్లిన ఆమె.. అతన్ని వాహనం నుంచి దింపి, రోడ్డు పక్కన కూర్చోబెడుతుంది. ఆ తర్వాత కారును ఆమె డ్రైవ్ చేసి అతడిపై బురద పడేలా చేస్తుంది. ఇలా రెండు మూడు సార్లు అటూ, ఇటూ వేగంగా నడిపి అతడిని బురదతో నింపేస్తుంది. దీంతో ఆమె కోపం చల్లారుతుంది. ఇలా ఆమె ఆ కారు డ్రైవర్‌పై (Woman takes revenge on car owner) ప్రతీకారం తీర్చుకుంటుంది.
ఆ తర్వాత కారును అక్కడే వదిలేసి ఆమె వెళ్లిపోయింది. అయితే ఇదంతా నవ్వుకోవడం కోసం కావాలని చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వారికి ఇలాగే బుద్ధి చెప్పాలి’.. అంటూ కొందరు, ‘ఈ మహిళ చేసిన పని.. మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 51 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి