Share News

Train Viral Video: వామ్మో.. ఏంటిదీ.. ఇంత భక్తి ఎక్కడైనా చూశారా.. రైలు డ్రైవర్‌ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:23 PM

రైలు పట్టాల దిగువన చాలా మంది భక్తులు పూజలు చేస్తున్నారు. కొందరు దేవుడి ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా. ఇందులో ఎలాంటి వింత లేకున్నా.. రైలు డ్రైవర్ చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..

Train Viral Video: వామ్మో.. ఏంటిదీ.. ఇంత భక్తి ఎక్కడైనా చూశారా.. రైలు డ్రైవర్‌ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో ఎక్కువగా రైళ్లలో ప్రయాణికులు చేసే వింత వింత విన్యాసాలకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు రైల్వే సిబ్బంది ప్రవర్తన కూడా చూసే వారికి విచిత్రంగా అనిపిస్తుంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ రైలు డ్రైవర్ చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వామ్మో.. ఏంటిదీ.. ఇంత భక్తి ఎక్కడైనా చూశారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


ఎక్కడ జరిగిందో ఏమో గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు పట్టాల దిగువన చాలా మంది భక్తులు పూజలు చేస్తున్నారు. కొందరు దేవుడి ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా. ఇందులో ఎలాంటి వింత లేకున్నా.. రైలు డ్రైవర్ చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.


రైలు అప్పటికే ఆగి ఉందో... లేక ప్రసాదం పంచుతున్నారని రైలును ఆపాడో తెలీదు గానీ.. వీడియోలో మాత్రం రైలు అక్కడ ఆగినట్లు కనిపిస్తోంది. కొందరు భక్తులు రైలు ఇంజిన్ సమీపానికి వెళ్లి, (Devotees offer prasad to train driver) ప్రసాదాన్ని డ్రైవర్‌కు అందజేస్తారు. రైలు డ్రైవర్ కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ ప్రసదాన్ని తీసుకుని కళ్లకు అద్దుకుని లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ చాలా మంది భక్తులు గుమికూడి ఉన్నారు. ఈ సీన్ చూసి అక్కడున్న వారంతా ఆవాక్కయ్యారు.


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ రైలు డ్రైవర్‌ భక్తి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘భక్తిశ్రద్ధలంటే ఇలా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 లక్షలకు పైగా లైక్‌లు, 24.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

బురద మీద పడిందని బుద్ధి చెప్పింది.. ఈ మహిళ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..

పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 31 , 2025 | 05:09 PM