Diabetes in Kids: పేరెంట్స్.. బీ అలర్ట్.. పిల్లల్లో ఈ లక్షణాలుంటే టైప్ 1 డయాబెటిస్!
ABN , Publish Date - Aug 28 , 2025 | 10:16 AM
డయాబెటిస్‌లో టైప్-1, టైప్-2 అని రెండు రకాలున్నాయి. టైప్-1 డయాబెటిస్ ఎక్కువగా పిల్లలు, యువకులలో కనిపిస్తుంది. జన్యుపరంగా ఈ వ్యాధి వచ్చే అవకాశమున్నందున అదనపు జాగ్రత్త అవసరం. మీ పిల్లల్లో ఈ సంకేతాలు కనిపిస్తుంటే జాగ్రత్త..
ప్రజలు తీసుకుంటున్న అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి అలవాట్లు వారికే కాదు. రాబోయే తరాల ఆరోగ్యాన్ని సవాల్ చేస్తున్నాయి. చిన్నవయసులోనే డయాబెటిస్ వంటి ప్రమాదకర వ్యాధి బారిన పడేందుకు కారణమవుతున్నాయి. ఇది జీవనశైలి సంబంధిత వ్యాధి అయినప్పటికీ.. చాలామంది పిల్లలకు జన్యుపరమైన లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తదితర కారణాల వల్ల టైప్ 1 డయాబెటిస్ సోకేందుకు ఛాన్స్ ఉంది. ఈ వ్యాధి శరీరంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెంచడంతో పాటు బీపీ సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, పిల్లలు ఆరోగ్య పరంగా ఇలాంటి లక్షణాలతో బాధపడుతుంటే ముందే జాగ్రత్త వహించండి.
టైప్ 1 డయాబెటిస్ సాధారణంగా పిల్లలలో సంభవిస్తుంది. ఇది జన్యుపరంగా వస్తుంది. దీనికి అదనపు జాగ్రత్త అవసరం. లేదంటే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. టైప్-1 డయాబెటిస్ ఉన్న పిల్లలను శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో నిరంతరం జాగ్రత్త వహించాలి. లేకపోతే టైప్ 1 డయాబెటిస్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు కీలకమైన క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుంది. దీనివల్ల శరీరంలోని కణాలు చక్కెరను ఉపయోగించుకోవడానికి అవసరమైన ఇన్సులిన్ అందదు. అప్పుడు శరీరంలోని రక్త నాళాలలో చక్కెర పేరుకుపోతూ పోతుంది. ఇలా జరిగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే తేలిగ్గా సమస్య నుంచి బయటపడవచ్చు.. పిల్లలలో టైప్ 1 డయాబెటిస్ యొక్క కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఇక్కడ ఉన్నాయి.
పిల్లలలో టైప్ 1 డయాబెటిస్ ప్రారంభ సంకేతాలు
తరచుగా మూత్ర విసర్జన (పాలియూరియా): పిల్లలు తరచుగా బాత్రూంకు వెళ్లడం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి మేల్కొంటే అది టైప్ 1 డయాబెటిస్ లక్షణం కావచ్చు. రక్తంలో అధిక గ్లూకోజ్ మూత్రం ద్వారా వెళ్లిపోతుంది కాబట్టి జాగ్రత్త.
అధిక దాహం (పాలిడిప్సియా): నిరంతరం మూత్ర విసర్జన చేయడం వల్ల పిల్లలు నిత్యం అధిక దాహంతో ఇబ్బందిపడుతుంటారు. సాధారణం కంటే తరచుగా ఎక్కువ నీరు తాగవచ్చు.
ఆకలి పెరగడం (పాలీఫేజియా): ఎక్కువ తిన్నప్పటికీ పిల్లలు ఇంకా ఆకలిగా ఉన్నట్లు భావిస్తారు. శరీరం శక్తి కోసం గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడమే కారణం.
ఆకస్మిక బరువు తగ్గడం: సాధారణ లేదా పెరిగిన ఆకలితో కూడా శరీరం శక్తి కోసం కొవ్వు, కండరాలను విచ్ఛిన్నం చేయడం వల్ల పిల్లలు బరువు తగ్గవచ్చు.
అలసట, తక్కువ శక్తి: పిల్లలు అసాధారణంగా అలసిపోయినట్లు, బలహీనంగా లేదా తక్కువ చురుగ్గా కనిపించవచ్చు ఎందుకంటే వారి కణాలకు తగినంత గ్లూకోజ్ అందదు.
అస్పష్టమైన దృష్టి: రక్తంలో అధిక చక్కెర కళ్ళలో వాపుకు కారణమవుతుంది. ఇది తాత్కాలిక దృష్టి సమస్యలకు దారితీస్తుంది.
చిరాకు, మానసిక స్థితిలో మార్పులు: వివరించలేని విధంగా పిల్లల్లో మానసిక స్థితిలో మార్పులు మొదలవుతాయి. చిరాకు లేదా విషయాలపై దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది ప్రారంభ లక్షణం కావచ్చు.
పండ్ల వాసనతో కూడిన శ్వాస: శరీరం శక్తి కోసం కొవ్వును కరిగించినప్పుడు కీటోన్‌లను ఉత్పత్తి చేస్తుంది, దీని వలన తీపి, పండ్ల వాసన వస్తుంది.
గాయాలు నెమ్మదిగా మానడం: చిన్న కోతలు, గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు నయం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, ఇది గ్లూకోజ్ నియంత్రణ సరిగా లేదని సూచిస్తుంది.
వికారం, వాంతులు: రక్తంలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటే, అది డయాబెటిక్ కీటోయాసిడోసిస్ (DKA) కు దారితీస్తుంది. ఇది తరచుగా కడుపు నొప్పి, వికారం లేదా వాంతులతో పాటు జరుగుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఖర్జూరం మాత్రమే కాదు.. దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఒక వరం..!
ఒక్కసారి ఇలా చేస్తే.. కడుపులోని గ్యాస్ మొత్తం బయటకు వస్తుందట!
For More Latest News