Pawan Kalyan: నేటి నుంచి సేనతో.. సేనాని సమావేశాలు..
ABN , Publish Date - Aug 28 , 2025 | 08:55 AM
తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న 10 మందిని ఎంపిక చేసి.. వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారు.
విశాఖపట్నం: జనసేన పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో మమేకమయ్యే దిశగా.. అడుగులు వేస్తుంది. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరఫున సేనతో సేనాని సమవేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టీ(గురువారం) నుంచి మూడు రోజుల పాటు విశాఖలో సమావేశాలు నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ మూడు రోజులు విశాఖలోనే ఉండి కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ నాయకులు సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న 10 మందిని ఎంపిక చేసి.. వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారు. ఆ రోజు రాత్రి ఉత్తరాంధ్ర ప్రాముఖ్యత తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మున్సిపల్ స్టేడియంలో, బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ హాల్లో సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అలాగే.. 30న ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగిస్తారు.
జనపార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన సేనతో సేనాని సమావేశాలు జనసేన పార్టీకి కొత్త బలం ఇస్తున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుపుకోవడానికి, వ్యూహాలు రూపొందించుకోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీకి సమయం కేటాయించడం, భవిష్యత్తు దిశను సూచించడం జనసైనికులకు ప్రేరణనిస్తుందని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం
తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్