Date Seeds Benefits: ఖర్జూరం మాత్రమే కాదు.. దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఒక వరం..!
ABN , Publish Date - Aug 27 , 2025 | 09:57 AM
ఖర్జూరం తిన్న తర్వాత విత్తనాలు పారేయడం అనేది సర్వసాధారణం. ఇకపై అలా చేయకండి. ఎందుకంటే, ఖర్జూర పండులో ఎన్ని పోషకాలు ఉంటాయో.. అంతకుమించి దాని విత్తనాల నుంచి లభిస్తాయి. ఖర్జూర విత్తనాలు డయాబెటిస్ సహా ఎన్నో అనారోగ్యాలను నివారించడంలో సహాయపడాతాయి. అవేంటంటే..
ఖర్జూరాలు రుచి తీపిగా ఉన్నప్పటికీ అద్భుత ఔషధ గుణాలున్న పండు. ఇది శక్తికి అద్భుతమైన వనరు మాత్రమే కాదు. ఇందులో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. దాని ఆరోగ్య ప్రయోజనాలను అర్థం చేసుకుని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ఖర్జూరాలు తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో లభించే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి, తద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కానీ, సాధారణంగా ఖర్జూరం తిన్న తర్వాత ప్రజలు దాని విత్తనాలను పనికిరానివిగా భావించి పారవేస్తారు. మీరు ఇప్పటివరకు ఇలా చేస్తుంటే ఇకపై చేయకండి. ఖర్జూర విత్తనాలు సైతం పోషకాల గనులే. ఈ గింజలలో ఒలీక్ ఆమ్లం, డైటరీ ఫైబర్, పాలీఫెనాల్స్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, మాంగనీస్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి డయాబెటిస్ మొదలు బరువు తగ్గడం వరకు ప్రతి దానికీ సహాయపడతాయి. ఖర్జూరం విత్తనాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? వీటిని తినడానికి సరైన మార్గం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరం విత్తనాలు ఖర్జూరం కంటే రెండింతలు ప్రయోజనకరంగా ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మనం చెత్తగా భావించి పారేసే ఖర్జూరం గింజలకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం...
ఖర్జూర విత్తనాల ప్రయోజనాలు
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, ఖర్జూర గింజల్లో ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. ఖర్జూర గింజల్లో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
ఖర్జూర గింజలు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. ఖర్జూర గింజలు సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెపోటు, గుండె వైఫల్యం, అరిథ్మియా మొదలైన వాటిని నివారిస్తుంది.
ఖర్జూరాలు కాల్షియం, భాస్వరాలకు మంచి మూలం. ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో పడతాయి. మూత్రపిండాలకు చాలా మంచివి.
ఖర్జూర గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపును క్లియర్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. బరువు కూడా తగ్గుతుంది. ఎక్కువ వ్యాయామం చేసేవారు కచ్చితంగా ఖర్జూర గింజలను తినాలని నిపుణులు అంటున్నారు. అవి కండరాలలో వాపును తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
ఖర్జూర గింజలను ఎలా తినాలి?
కొన్ని విత్తనాలను సేకరించి బాగా శుభ్రం చేయండి. తరువాత వాటిని ఎండలో ఆరబెట్టి మీడియం మంట మీద పాన్‌లో వేయించాలి. అవి క్రిస్పీగా మారాక వాటిని తీసి గ్రైండర్‌లో వేసి రుబ్బుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ ఒక టీస్పూన్ గోరువెచ్చని పాలతో తీసుకోవచ్చు. లేదంటే, ఆ పొడిని నీరు లేదా తేనెతో కలిపి రోజుకు ఒకసారి తినవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
భారత్‌లో 8.74 లక్షల క్యాన్సర్ మరణాలు