Rising Cancer Cases: భారత్‌లో 8.74 లక్షల క్యాన్సర్ మరణాలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:44 AM
భారత్‌లో క్యాన్సర్ మరణాలు పెరిగిపోతున్నాయి. 2024లో దేశంలో 15.60 లక్షల కొత్త కేసులు వెలుగు...
2024లో 15.60 లక్షల కొత్త కేసులు: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ, ఆగస్టు 26: భారత్‌లో క్యాన్సర్ మరణాలు పెరిగిపోతున్నాయి. 2024లో దేశంలో 15.60 లక్షల కొత్త కేసులు వెలుగు చూడగా వీరిలో 8,74,404 మంది మరణించారని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే 2045 నాటికి భారత్‌లో 24.60 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనం వివరాలు తాజాగా జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్(జేఏఎంఏ)లో ప్రచురితమయ్యాయి. ఆ నివేదిక ప్రకారం...
దేశంలో ఈ క్యాన్సర్లు ఎక్కువ
మన దేశంలో పురుషులు సాధారణంగా నోటి, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్ క్యాన్సర్ల బారిన పడుతుంటారు. 2024లో నమోదైన కొత్త కేసుల్లో 1.13 లక్షలకు పైగా నోటి క్యాన్సర్‌కి సంబంధించినవే కావడం గమనార్హం. ఇక మహిళల్లో రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లు ఎక్కువ.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కేన్సర్ ముప్పు తగ్గించడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవడం అత్యావశ్యకమని అధ్యయనం పేర్కొంది. పొగాకు వినియోగం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, కొద్దిపాటి నడక, మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు నిత్యం చేయడం, వేపుళ్లు, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటంతో పాటు తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. కాగా, క్యాన్సర్ నియంత్రణ ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోందని ఐసీఎంఆర్ వెల్లడించింది. 30 ఏళ్లు నిండిన వారంతా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకొనేలా ప్రోత్సహిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News