Obesity Guidelines: చాపకింద నీరులా ఊబకాయం..
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:41 AM
భారత్‌లో ఊబకాయం సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోందని ఇటీవల ప్రధాని మోదీ హెచ్చరించారు. ..
మార్గదర్శకాల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు 26: భారత్‌లో ఊబకాయం సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోందని ఇటీవల ప్రధాని మోదీ హెచ్చరించారు. ప్రతిఒక్కరూ దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నొక్కిచెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ప్రతి నలుగురులో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఊబకాయాన్ని నియంత్రించేందుకు కేంద్రం తొలిసారిగా మార్గదర్శకాలు రూపొందించడంపై దృష్టిపెట్టింది. ఈ అంశంపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు, హార్మోన్ సంబంధిత వ్యాధి నిపుణులు, పోషకాహార నిపుణులు, మధుమేహ, ఇతర వైద్య నిపుణులు ఇటీవలే సమావేశమయ్యారు. భారత్‌లో స్థూలకాయానికి సంబంధించి ఇప్పటివరకూ జాతీయస్థాయి మార్గదర్శకాలేమీ లేవు. డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన మార్గదర్శకాలనే వైద్యులు అనుసరిస్తున్నారు. 2018లో ఐసీఎంఆర్ టైప్-2 డయాబెటి్‌సపై మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిలోనే ఊబకాయం గురించి కూడా పరిమిత సూచనలు చేసింది. అందులో.. స్థూలకాయం ఉన్నవారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నించాలని పేర్కొంది. ప్రస్తుతం సూచించే మార్గదర్శకాల్లో ఊబకాయంపై ముందు జాగ్రత్త చర్యలు, నివారణ, స్ర్కీనింగ్, రోగ నిర్ధారణ, చికిత్సపై దృష్టి సారించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News