Share News

BC Bill Issue: తుది దశకు బీసీ రిజర్వేషన్ల బిల్లు..

ABN , Publish Date - Aug 28 , 2025 | 09:46 AM

రిజర్వేషన్ల కోసం కేంద్రంపై చేసిన ఒత్తడితో ఎటువంటి ఫలితం రాకపోవడంతో ఇక ఏం చెయ్యాలనే దానిపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేసింది. రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చించినట్లు సమాచారం.

BC Bill Issue: తుది దశకు బీసీ రిజర్వేషన్ల బిల్లు..

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బీసీ బిల్లు అంశం తుది దశకు చేరుకుందని అనిపిస్తుంది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ.. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లుకు కేంద్రం అమోదం తెలపకపోవడంతో తీవ్ర దుమారం లేచింది. దీంతో..సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ ఎంపీలతో పాటూ, ఇండియా కూటమి ఎంపీల మద్దతు కూడగట్టారు. అంతేకాదు ఢిల్లీ జంతర్ మంతర్ లో బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. అయితే ధర్నా ముగిసాక రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు. కానీ రాష్ట్రపతి అపాయంట్మెంట్ ఇవ్వలేదు.. దాంతో మోడీ సర్కార్ బీసి రిజర్వేషన్లు అమలుకు అడ్డం పడుతుందని ఆరోపించారు. ఇక ఢీల్లీ వదిలి రాష్ట్రంలోనే ఏం చెయ్యాలనే దానిపై డిసైడ్ చేస్తామని గతంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు.


రిజర్వేషన్ల కోసం కేంద్రంపై చేసిన ఒత్తడితో ఎటువంటి ఫలితం రాకపోవడంతో ఇక ఏం చెయ్యాలనే దానిపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేసింది. రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రిజర్వేషన్ల పెంపు కోసం పలు ప్రయత్నాలు కూడా చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ షెడ్యూల్డు కులాల బిల్లు (ఎస్సీ వర్గీకరణ)-2025, తెలంగాణ ధార్మిక- హిందూ మత సంస్థల- ధర్మాదాయములు-2025 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.


ఈ నేపథ్యంలో మంత్రుల సబ్ కమిటీతో పాటు న్యాయ సంప్రదింపుల కమిటీతో విస్తృత చర్చలు జరిపినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వారు ఇచ్చిన ఆప్షన్లపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చర్చల అనంతరం తెలంగాణ సర్కార్ ముందు... కమిటీలు మూడు ఆప్షన్లను ఉంచింది.

1. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం

2. స్పెషల్ GOతో రిజర్వేషన్లు ఇవ్వడం

3. కేంద్రం ఆమోదముద్ర వేసే వరకు వేచి చూస్తూ.. ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయడం

స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం

తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్

Updated Date - Aug 28 , 2025 | 10:36 AM