Gas Pain Relief Tips: ఒక్కసారి ఇలా చేస్తే.. కడుపులోని గ్యాస్ మొత్తం బయటకు వస్తుందట!
ABN , Publish Date - Aug 28 , 2025 | 09:44 AM
Gas Problems Remedies: చాలామంది తిన్న వెంటనే గ్యాస్ సమస్యతో తీవ్రంగా బాధపడుతుంటారు. పుల్లటి తేన్పులు, కడుపు ఉబ్బరం, ఛాతీలో మంట వంటి లక్షణాలు, తీవ్రనొప్పి కడుపును మెలిపెట్టేస్తు్న్నట్టే ఉంటుంది. పొట్టలో నుంచి గ్యాస్ బయటికి రాక నానా అవస్థ పడుతుంటారు. కానీ, ఈ పని చేస్తే క్షణాల్లో కడుపులోని గ్యాస్ మొత్తం వెలుపలికి వచ్చేస్తుందని డాక్టర్లు అంటున్నారు.
కడుపులో గ్యాస్ ఏర్పడటం చాలా సాధారణ ఆరోగ్య సమస్య. ముఖ్యంగా తిన్న తర్వాత చాలా మంది ప్రజలు కడుపు ఉబ్బరం, ఛాతీలో నొప్పి, మంట వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ గ్యాస్ బయటకు పోనప్పుడు సమస్య మరింత పెరుగుతుంది. కొంతమందికి కడుపులో ఏర్పడిన గ్యాస్ అక్కడే చిక్కుకుపోతుంది. అలాంటి పరిస్థితిలో నొప్పి కూడా చాలా తీవ్రమవుతుంది. గ్యాస్ కడుపులో కదలాడుతున్నట్లే ఉంటుంది. కాబట్టి చాలా సార్లు నడుము దిగువ భాగంలో, ఛాతీ భాగంలో నొప్పి మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఈ ఇంటి నివారణ చిట్కాలు పాటిస్తే తక్షణమే సమస్య తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ ఈ పనిచేస్తే గ్యాస్ మాయం..
కడుపులో నుంచి గ్యాస్ ఎంతకీ బయటకు వెళ్లలేకపోతే ప్రతిరోజూ ఒక చిన్న పని చేయవచ్చు. రెండు చుక్కల ఆముదం నూనె తీసుకొని నాభిపై రాయాలి. స్నానం చేసిన తర్వాత, నిద్రపోయే ముందు ఇలా చేయాలి. కావాలంటే నడుము దిగువ భాగంలో తేలికపాటి మసాజ్ కూడా చేసుకోవచ్చు.
ఈ చిట్కా ప్రయోజనాలు
గ్యాస్ సమస్యకు ఆముదం ఉత్తమ పరిష్కారాల్లో ఒకటని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ఆయుర్వేదంలో ఈ పద్ధతిని ఆచార్య వాగ్భట దీనిని 'కటి-గుహ్య-పృష్ఠ శోధనాశక్' అని పిలిచారు. ఇది చాలా మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్. వాత దోషాలనూ నివారిస్తుంది. కడుపులో గ్యాస్ చిక్కుకుపోయినా లేదా గ్యాస్ కారణంగా నడుములో నొప్పి ఉంటే ఈ పని ప్రతిరోజూ చేయడం ప్రారంభించండ. కనీసం 20 నుండి 21 రోజుల పాటు నాభిపై ఆముదం నూనె పూసుకుంటే మందుల అవసరం రాకపోవచ్చు.
ఈ విషయంలో జాగ్రత్త
వాస్తవానికి ఆముదం స్వభావం వేడిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ కడుపులో వేడి ఉంటే లేదా శరీరంలో చాలా వేడి ఉంటే అప్పుడు సమస్య ఉండవచ్చు. కాబట్టి, మొదటి కొన్ని రోజులు చాలా తక్కువ మొత్తంలో నూనెను పూయడం మంచిది. ఈ వ్యవధిలో ఏదైనా సమస్యను ఉత్పన్నమైందో.. లేదో.. గమనించండి. ఎటువంటి సమస్య లేకపోతే ఈ చిట్కాను భేషుగ్గా ప్రయత్నించవచ్చు. కచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఖర్జూరం మాత్రమే కాదు.. దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఒక వరం..!
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం లేదా వ్యాయామం చేయడం మంచిదేనా?
For More Latest News