Health Tips: భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం లేదా వ్యాయామం చేయడం మంచిదేనా?
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:40 PM
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం లేదా వ్యాయామం చేయడం మంచిదా? ఏం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి
ఇంటర్నెట్ డెస్క్: తిన్న తర్వాత చాలా మంది నిద్రపోవడం లేదా పని చేయడానికి కూర్చోవడం వంటి పనులు చేస్తారు. అయితే, ఇలా చేయడం ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి, తిన్న తర్వాత ఏం చేయడం ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహ వ్యాధిగ్రస్తులకు, జీర్ణక్రియ సమస్యతో ఇబ్బంది పడేవారికి తిన్న తర్వాత తేలికపాటి వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత కేవలం 5 నిమిషాల తేలికపాటి కార్యకలాపాలు కూడా ప్రభావం చూపుతాయని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు.భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం కంటే, తేలికపాటి కదలికలు చేయాలని సూచిస్తున్నారు. ఇది శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
పాదాల మడమలను పైకి లేపడం, తగ్గించడం (కాల్ఫ్ రైజెస్) గ్లూకోజ్ కండరాలలోకి వెళ్లడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తిన్న తర్వాత తేలికపాటి శారీరక శ్రమ గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. తేలికగా నడవడం ప్రభావవంతంగా ఉంటుంది.
తేలికపాటి వ్యాయామం రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది కడుపు, ప్రేగులలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను సజావుగా ఉంచుతుంది. తేలికగా నడవడం వల్ల బరువు, కడుపు ఉబ్బరం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, తిన్న తర్వాత తేలికపాటి కదలికలు ప్రయత్నించండి. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
కుక్క కరిస్తే ఎన్ని గంటల్లోపు ఇంజెక్షన్ ఇవ్వాలో తెలుసా?
2030 కామన్వెల్త్ బిడ్‌కు భారత్ గ్రీన్ సిగ్నల్.. ఈ నగరానికి ఛాన్స్
For More Latest News