Share News

India to Host Commonwealth Games 2030: 2030 కామన్వెల్త్ బిడ్‌కు భారత్ గ్రీన్ సిగ్నల్.. ఈ నగరానికి ఛాన్స్

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:04 PM

భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

India to Host Commonwealth Games 2030: 2030 కామన్వెల్త్ బిడ్‌కు భారత్ గ్రీన్ సిగ్నల్.. ఈ నగరానికి ఛాన్స్
India to Host Commonwealth Games 2030

ఢిల్లీ: 2030 కామన్వెల్త్ గేమ్స్ (India to Host Commonwealth Games 2030) హోస్ట్ చేయడానికి భారత్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన యూనియన్ కేబినెట్ మీటింగ్‌లో బిడ్ వేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బిడ్ గెలిస్తే అహ్మదాబాద్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. అది కూడా గుజరాత్ సర్కార్‌కి గ్రాంట్ ఇన్ ఎయిడ్‌తో సహా అన్ని సపోర్ట్‌లతో జరగనుంది. ఒకవేళ మన బిడ్ గెలిస్తే, హోస్ట్ కొలాబరేషన్ అగ్రిమెంట్ (HCA) కూడా సైన్ అవుతుంది.


అహ్మదాబాద్ ఎందుకు?

అహ్మదాబాద్‎లో వరల్డ్ క్లాస్ స్టేడియంలు, అత్యాధునిక ట్రైనింగ్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ పట్ల ఉన్న ప్యాషన్ సహా అనేకం ఉన్నాయి. నరేంద్ర మోదీ స్టేడియం కూడా ఇక్కడే ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. 2023లో ICC క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌ని సక్సెస్‌ఫుల్‌గా హోస్ట్ చేసిన ఈ స్టేడియం, CWG 2030కి కూడా రెడీగా ఉంది. ఇక్కడ అథ్లెట్లు, కోచ్‌లు, టెక్నికల్ ఆఫీసర్లు, టూరిస్టులు, మీడియా పర్సన్స్ సహా అందరూ ఒక చోట అందుబాటులో ఉంటారు.


72 దేశాల నుంచి అథ్లెట్లు..

ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో 72 దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొంటారు. ఇది కేవలం స్పోర్ట్స్ ఈవెంట్ మాత్రమే కాదు, ఒక గ్లోబల్ సెలబ్రేషన్ అని కూడా చెప్పవచ్చు. ఈ ఈవెంట్ వల్ల లోకల్ వ్యాపారాలకు కూడా మేలు జరుగుతుంది. హోటల్స్, రెస్టారెంట్లు, టూరిజం... అన్నీ బూస్ట్ అవుతాయి. అంతేకాదు, ఈ ఈవెంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. స్పోర్ట్స్, సైన్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, బ్రాడ్‌కాస్ట్, మీడియా, IT, కమ్యూనికేషన్స్... ఇలా ఎన్నో రంగాల్లో యువతకు అవకాశాలు దొరుకుతాయి.


స్పోర్ట్స్‌తో పాటు టూరిజం..

CWG 2030 భారత్‌లో జరగడం వల్ల స్పోర్ట్స్‌తో పాటు టూరిజం కూడా పెరుగుతుంది. అహ్మదాబాద్‌ని సందర్శించే టూరిస్టులు, గుజరాత్ సంస్కృతి, ఆహారం, హాస్పిటాలిటీని ఎంజాయ్ చేస్తారు. ఇది యువ అథ్లెట్లకు కూడా ఓ స్ఫూర్తి అని చెప్పవచ్చు. స్పోర్ట్స్‌ని కెరీర్‌గా ఎంచుకోవాలనే ఆలోచన ఎంతో మందిలో వస్తుంది. ఇది మన దేశంలో స్పోర్ట్స్ కల్చర్‌ని మరింత పెంచుతుంది.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2025 | 06:25 PM