Hilarious Viral Video: బంధువులు దొంగలుగా మారిపోయారు.. ఫన్నీ వీడియో వైరల్..
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:04 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన సరదా సంఘటనలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన సరదా సంఘటనలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లిలో బంధువులు చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరు (viral relatives video).
@Shizukahuji అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వివాహ కార్యక్రమం జరుగుతోంది. వధూవరులిద్దరూ నిలబడి ఉన్నారు. వరుడు కరెన్సీ నోట్లను పట్టుకుని వధువు ఎదురుగా నిల్చుని ఉన్నాడు. వధువు చూట్టూ పెళ్లికి వచ్చిన అతిథులు ఉన్నారు. వరుడు తన చేతిలో కరెన్సీ కట్టలతో వధవుకు దిష్టి తీశాడు. అనంతరం ఆ కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరేశాడు. దీంతో వధువు చుట్టూ నిల్చున్న వారు ఆ నోట్ల కోసం ఎగబడ్డారు (relatives become robbers).
ఆ కరెన్సీ నోట్లను అందుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో వధువును కూడా తోసుకుంటూ వెళ్లిపోయారు. వారి మధ్యలో చిక్కుకున్న వధువును వరుడు బయటకు లాగాడు. ఆ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 46 వేల మంది ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. వారు బంధువులు కాదు.. దొంగలని ఒకరు సరదాగా కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..
రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..