Gold Silver Rates on Aug 28: బంగారం ధరల్లో పెరుగుదల.. నేటి రేట్స్ ఏంటంటే..
ABN , Publish Date - Aug 28 , 2025 | 06:54 AM
అంతర్జాతీయ పరిణామాలు, పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మరి నేడు భారత్‌లోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి (Gold, Silver Rates on Aug 28). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,450గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ.93,910గా ఉంది. ఇక 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.76,840గా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,900గా ఉంది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.38,090గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా
చెన్నై: ₹1,02,450; ₹93,910; ₹77,710
ముంబయి: ₹1,02,450; ₹93,910; ₹76,840
ఢిల్లీ: ₹1,02,600; ₹94,060; ₹76,960
కోల్‌కతా: ₹1,02,450; ₹93,910; ₹76,840
బెంగళూరు: ₹1,02,450; ₹93,910; ₹76,840
హైదరాబాద్: ₹1,02,450; ₹93,910; ₹76,840
కేరళ: ₹1,02,450; ₹93,910; ₹76,840
పుణె: ₹1,02,450; ₹93,910; ₹76,840
వడోదరా: ₹1,02,500; ₹93,960; ₹76,880
అహ్మదాబాద్: ₹1,02,500; ₹93,960; ₹76,880
వివిధ నగరాల్లో వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹1,29,900
ముంబయి: ₹1,19,900
ఢిల్లీ: ₹1,19,900
కోల్‌కతా: ₹1,19,900
బెంగళూరు: ₹1,19,900
హైదరాబాద్: ₹1,29,900
కేరళ: ₹1,29,900
పుణె: ₹1,19,900
వడోదరా: ₹1,19,900
అహ్మదాబాద్: ₹1,19,900
ఆగస్టు నెలలో ఇప్పటివరకూ బంగారం ధర 1.6 శాతం పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ సుంకాలు, బలహీన పడుతున్న డాలర్, ద్రవ్యోల్బణం, పండుగ సీజన్ వంటివి బంగారానికి డిమాండ్ పెరిగేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్న వేళ బంగారం ధర రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్సు ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
అమల్లోకి ట్రంప్ సుంకాలు.. భారత్‌లోని ప్రభావిత రంగాలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి