Share News

KTR VS CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రా.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ సవాల్

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:24 PM

సీఎం అంటే కటింగ్ మాస్టర్ మాదిరిగా రేవంత్ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సిటీలో మళ్లీ తాగునీటి కష్టాలు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్‌నేనని విమర్శించారు. చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని నొక్కిచెప్పారు కేటీఆర్.

KTR VS CM Revanth Reddy:  హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రా.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ సవాల్
KTR VS CM Revanth Reddy

హైదరాబాద్, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి (Hyderabad Development)పై తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ, సచివాలయం, గాంధీ భవన్ ఎక్కడైనా సరే.. రేవంత్‌తో చర్చకు రెడీ అని ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరాశ, నిస్పృహతో ఉన్నారని విమర్శించారు. ఇవాళ(బుధవారం) తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Election) లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని రేవంత్‌కు అర్ధమైందని సెటైర్లు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్.


అందుకే తనపై రేవంత్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదని భావించి.. రేవంత్‌రెడ్డి తనపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయన కంటే గట్టిగా తాను మాట్లాడగలనని... రేవంత్‌రెడ్డికి సమాధానం చెప్పే సత్తా తనకు ఉందని స్పష్టం చేశారు. కానీ తమ అధినేత కేసీఆర్ సూచనలతో‌నే రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు తాను దిగటం లేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పాలని కేసీఆర్ (KCR) తనకు చెప్పారని పేర్కొన్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శించిన.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి రేవంత్‌రెడ్డిని తాను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్.


హైదరాబాద్, జూబ్లీహిల్స్ అభివృద్ధిపై రేవంత్‌రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. హోంశాఖను పర్యవేక్షిస్తున్న రేవంత్‌రెడ్డి హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో గన్, డ్రగ్ కల్చర్ పెరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్.. చెత్త సిటీ, క్రైం సిటీగా మారిందని విమర్శించారు. అండర్ పాస్‌లు, ప్లైఓవర్లు కేసీఆర్ హయాంలోనే నిర్మించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారో చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో వంద లింకు రోడ్లు నిర్మించామని ఉద్ఘాటించారు మాజీ మంత్రి కేటీఆర్.


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోడ్లపై ఉన్న ఒక గుంత కూడా ఎందుకు పూడ్చలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ మాదిరిగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సిటీలో మళ్లీ తాగునీటి కష్టాలు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్‌నేనని విమర్శించారు. చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని నొక్కిచెప్పారు. మెట్రో నిర్మించిన ఎల్అండ్ టీని సీఎం రేవంత్‌రెడ్డి బెదిరించారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన.. ప్రముఖ సంస్థల ఛైర్మన్లతో

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 04:39 PM