Share News

Indian Railways Offers: రైల్వే పండగ స్పెషల్.. రిటర్న్ టికెట్‌పై 20% డిస్కౌంట్..!

ABN , Publish Date - Aug 09 , 2025 | 06:23 PM

Indian Railways Round Trip Package: పండగల వేళ రైల్వే శాఖ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రౌండ్ ట్రిప్ టికెట్ బుక్ చేసుకునే ఒక్కో ప్రయాణికులకు టికెట్ పై 20 శాతం తగ్గింపు లభిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

Indian Railways Offers: రైల్వే పండగ స్పెషల్.. రిటర్న్ టికెట్‌పై 20% డిస్కౌంట్..!
Railway Minister announces 20% discount on return train tickets

పండుగల సీజన్‌ మొదలైపోయింది. ఈ సమయంలో ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అందుకే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే పౌరులకు ఒక మంచి ఆఫర్‌ ప్రకటించింది. ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’ పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు రిటర్న్ టికెట్‌లపై 20 శాతం డిస్కౌంట్ లభిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది తాత్కాలిక పథకం. కాగా, పండుగ సీజన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ను ప్రోత్సహించడంతో పాటు రద్దీని నియంత్రించడంలో ఈ పథకం సహాయపడనుంది.


రైల్వే శాఖ ప్రకటించిన ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’ తాత్కాలిక పథకం. డిస్కౌంట్‌ రౌండ్ ట్రిప్ (ఇరువైపులా) టికెట్‌లపై మాత్రమే 20 శాతం ఆఫర్ వర్తిస్తుంది. ప్రయాణికుడు రైల్లో ఊరికి వెళ్లే టికెట్‌తో పాటు తిరుగు ప్రయాణం కోసమూ టికెట్‌ను ఒకేసారి బుక్‌ చేసినప్పుడే ఈ రాయితీ వర్తిస్తుంది. టికెట్ బుకింగ్ సమయంలో ఇచ్చే ప్రయాణ వివరాల ఆధారంగా డిస్కౌంట్ వర్తించనుంది. ఇరువైపులా టికెట్‌లు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే రెండు టికెట్లు ఒకే తరగతికి చెందినవై ఉండాలి.


2025 ఆగస్టు 14 నుంచి ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’ ఆఫర్ కింద ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. 2025 అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 26 మధ్య ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగే 2025 నవంబర్ 17 నుండి డిసెంబర్ 1 మధ్య తిరుగుప్రయాణం కోసం రిటర్న్ టికెట్లు బుక్ చేసుకోవాలి. ఈ ఆఫర్‌కు 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ నియమం వర్తించదు. ఇది ప్రయాణికులకు అదనపు సౌలభ్యం.


ఈ పథకం ప్రయాణికులపై టికెట్ల భారాన్ని తగ్గిస్తుందని.. సజావుగా ప్రయాణించేందుకు ఉపయోగపడుతుందని రైల్వే శాఖ పేర్కొంది. పండగ సమయంలో టికెట్ల డిమాండ్ పెరిగే నేపథ్యంలో, ముందు జాగ్రత్తగా రిజర్వేషన్ చేసుకునేలా ప్రయాణికులను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.


ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఐసీఐసీఐ బ్యాంక్ షాక్..ఇకపై మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంపు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 09 , 2025 | 07:32 PM