Share News

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ షాక్..ఇకపై మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంపు

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:30 PM

ప్రమఖ ప్రైవేట్ బ్యాంక్ ICICI తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆగస్ట్ 1 నుంచి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే వారు ఇకపై మినిమం బ్యాలెన్స్ రూ.50 వేలు మెయింటెన్ చేయాలని స్పష్టం చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ షాక్..ఇకపై మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంపు
icici minimum balance 2025

మీరు ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్‌ మినిమం బ్యాలెన్స్ విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం ముఖ్యంగా మెట్రో, అర్బన్ ఏరియాల్లో సేవింగ్స్ అకౌంట్‌లకు మినిమం బ్యాలెన్స్ రూ.10,000 నుంచి ఏకంగా రూ.50,000కి పెంచేసింది. ఈ కొత్త రూల్ ఆగస్టు 1, 2025 తర్వాత ఓపెన్ అయ్యే అన్ని కొత్త అకౌంట్‌లకు వర్తిస్తుంది. ఈ విషయం శనివారం బ్యాంక్ విడుదల చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.

ప్రాంతం

పాత మినిమం బ్యాలెన్స్ (రూ.)

కొత్త మినిమం బ్యాలెన్స్ (రూ.)

మెట్రో / అర్బన్

10,000

50,000

సెమీ-అర్బన్

5,000

25,000

గ్రామీణ ప్రాంతాలు

2,500

10,000


గ్రామీణ ప్రాంతాల్లో కూడా

దీంతోపాటు సెమీ-అర్బన్, రూరల్ ఏరియాల్లో కూడా మినిమం బ్యాలెన్స్ పెంచారు. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ.5,000 మినిమం బ్యాలెన్స్ ఉంటే, ఇప్పుడు అది రూ.25,000కి పెరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల బ్రాంచ్‌లలో రూ.2,500 నుంచి రూ.10,000కి పెంచారు. అంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే, అకౌంట్‌లో ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.


కొత్త సర్వీస్ ఛార్జీలు

మినిమం బ్యాలెన్స్‌తో పాటు, బ్యాంక్ క్యాష్ ట్రాన్సాక్షన్‌లపై కూడా కొత్త ఛార్జీలు విధించింది. ఇప్పుడు ఒక నెలలో మూడు ఫ్రీ క్యాష్ ట్రాన్సాక్షన్‌ల తర్వాత, అదనపు ట్రాన్సాక్షన్‌లకు (డిపాజిట్ లేదా విత్‌డ్రాయల్) రూ.150 వసూలు చేస్తారు. అంటే, బ్రాంచ్‌లో లేదా ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ లేదా విత్‌డ్రా చేస్తే, మూడు ట్రాన్సాక్షన్‌లు ఫ్రీ, ఆ తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.


సెలవు రోజుల్లో డిపాజిట్ చేసినా

అంతేకాదు నాన్-బ్యాంకింగ్ అవర్స్ లలో లేదా హాలిడేస్‌లో ఏటీఎం ద్వారా క్యాష్ డిపాజిట్ చేస్తే, నెలలో టోటల్ ట్రాన్సాక్షన్ రూ.10,000 దాటితే, ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ.50 వసూలు చేస్తారు. మెట్రోలలో ఐసీఐసీఐ కాని ఏటీఎంలలో ట్రాన్సాక్షన్‌లు చేస్తే, మొదటి మూడు ఉచిత ట్రాన్సాక్షన్‌ల తర్వాత, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కి రూ.23, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కి రూ.8.50 ఛార్జ్ చేస్తారు. ఈ లిమిట్ ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లను కలిపి కౌంట్ చేస్తారు.


మెయింటైన్ చేయకపోతే ఎలా

ఆగస్టు 1, 2025 తర్వాత కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసినవాళ్లు ఈ కొత్త మినిమం బ్యాలెన్స్ రూల్స్‌ని తప్పక పాటించాలి. ఒకవేళ ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే, పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో మినిమం బ్యాలెన్స్‌ని క్వార్టర్లీ బేసిస్‌లో ట్రాక్ చేస్తారు. అంటే, మీ అకౌంట్ బ్యాలెన్స్ రూ.50,000 కంటే తక్కువగా ఉన్న రోజులు (షార్ట్‌ఫాల్ డేస్) ఉన్నా, ఆ క్వార్టర్‌లో మిగిలిన రోజుల్లో ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే, సగటు బ్యాలెన్స్ లిమిట్‌లోకి వస్తే పెనాల్టీ ఉండదు. కాబట్టి, మీ అకౌంట్ బ్యాలెన్స్‌ని క్వార్టర్‌లో సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది.


ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 09 , 2025 | 12:59 PM