Odisha Nurse: రక్షాబంధన్ జరుపుకోవాలని ఇంటికి బయలుదేరింది.. సడన్‌గా ఆస్పత్రి బాత్రూంలో..
ABN , Publish Date - Aug 09 , 2025 | 06:03 PM
ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేసే యువతి.. తన సోదురుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే ప్రయాణానికి కొన్ని గంటల ముందు.. ఆస్పత్రిలోని బాత్రూంలోకి వెళ్లింది. అయితే బయటికి రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి చూడగా..
రక్షాబంధన్ వచ్చిందటే చాలు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు ఎక్కడ ఉన్నా తప్పక కలుసుకుంటారు. దూరంగా ఉన్న వారు సైతం తమ పుట్టింటికి వెళ్లి అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టి వస్తుంటారు. అన్నాతమ్ముళ్లకు ఎలాంటి ఆపదలు రాకుండా, వారి జీవితం సుఖసంతోషాలమయంగా ఉండాలని రాఖీ కడుతుంటారు. ఇలాగే ఓ నర్సు కూడా తన అన్నకు రాఖీ కట్టాలని ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరింది. అయితే ఏం జరిగిందో ఏమో గానీ.. చివరకు ఆస్పత్రిలో శవమై తేలింది. ఒడిశా భువనేశ్వర్‌లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని (Odisha) గంజాం జిల్లాకు చెందిన ఓ నర్సు.. భువనేశ్వర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. అయితే శనివారం రాఖీ పండుగ సందర్భంగా తన సోదురుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే ప్రయాణానికి కొన్ని గంటల ముందు.. ఆస్పత్రిలోని బాత్రూంలోకి వెళ్లింది. అయితే బయటికి రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి చూడగా.. లోపల అపస్మారక స్థితిలో కనిపించింది.
చివరకు వైద్యులు వెళ్లి పరిశీలించగా.. అప్పటికే ఆమె మృతి చెందిందని తెలిసింది. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే దీనిపై మృతురాలి (Nurse dies under suspicious circumstances) కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మృతదేహాన్ని తమకు అప్పగించడానికి రెండు గంటలు ఆలస్యం చేశారని, తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
అయితే నర్సు మృతిపై పోలీసులు మాట్లాడుతూ.. ఆమె చనిపోయిన సమయంలో చేతిలో సిరంజి ఉందని చెప్పారు. సిరంజి ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకుందా, లేక ఆస్పత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా.. అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇదిలావుండగా.. ఒడిశాలోని కటక్‌లో మే 30న ఓ నర్సు కూడా ఇలాగే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి