PAN Card Loan Fraud: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నట్లు డౌట్ వస్తుందా? చెక్ చేయండిలా!
ABN , Publish Date - Sep 02 , 2025 | 03:36 PM
మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందా? మీకు తెలియకుండా మీ పాన్ కార్డుపై వేరే ఎవరైనా రుణం తీసుకున్నారని అనుమానంగా ఉందా? ఈ సందేహానికి కేవలం 2 నిమిషాల్లోనే సాల్వ్ చేసుకోండి.
నేటికాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ పాన్ కార్డు తీసుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా లింక్ చేయాలనే రూల్ తర్వాత అందరి దగ్గరా పాన్ కార్డులు ఉంటున్నాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి పాన్ కార్డు ప్రాముఖ్యత తెలియదు. అవగాహన లేక కొన్ని చోట్ల తమ పాన్ వివరాలను బహిర్గతం చేస్తుంటారు. ఇదే అదనుగా మోసగాళ్లు అడ్డదారుల్లో పాన్ వివరాలు సేకరిస్తూ సదరు డేటాను తాము చేసే మోసాలకు ఇష్టారీతిన వాడేస్తున్నారు. గిరిజనుల పాన్ కార్డులు సేకరించి వాళ్ల పేరిట కోట్లాది రుణాలు బ్యాంక్ నుంచి తీసుకున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందు మీ పాన్ కార్డు భద్రంగా ఉందో? లేదో? తనిఖీ చేసుకోవడం అవసరం. మీ పాన్ కార్డు వాడుకుని ఎవరైనా లోన్ తీసుకున్నారా? ఎలా చెక్ చేయాలి? అనే వివరాలు ఈ కథనంలో..
డిజిటల్ మోసాలు రోజురోజుకీ పెరుగుతుండటంతో వ్యక్తిగత సమాచారానికి రక్షణ లేకుండా పోయింది. ప్రజల గుర్తింపు కార్డులు దుర్వినియోగానికి గురవుతున్న ఘటనలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా పాన్ కార్డు వివరాలు ఉపయోగించి థర్డ్ పార్టీ వ్యక్తులు రుణాలు తీసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. అలా మీ పేరు మీద ఎవరైనా ఫేక్ లోన్ తీసుకుంటే అది కచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. అందుకే మీరు తీసుకోని రుణాలు మీ PAN నంబర్ ఆధారంగా రిజిస్టర్డ్ అయ్యాయా? లేదా? అనేది తెలుసుకోవడం చాలా అవసరం.
ఎలా చెక్ చేయాలి?
మీ పాన్ కార్డు ఆధారంగా సిబిల్ (CIBIL), ఎక్విఫాక్స్ (Equifax), ఎక్స్‌పీరియన్ (Experian) వంటి క్రెడిట్ బ్యూరోల వద్ద నుంచి ఫ్రీగా లేదా చెల్లింపు ద్వారా క్రెడిట్ రిపోర్ట్ తీసుకోండి. ఈ రిపోర్టులో మీరు తీసుకున్న అన్ని లోన్లకు సంబంధించిన వివరాలుంటాయి. క్రెడిట్ కార్డు లావాదేవీలు, బాకీల వివరాలు, ఎంక్వైరీలు (Hard inquiries)ఉంటాయి. మీరు అప్లై చేయని ఏవైనా లోన్లకు సంబంధించి హార్డ్ ఎంక్వైరీలు (Hard Enquiries) కనిపిస్తే వెంటనే అలర్ట్ అవండి. అవి అనుమానాస్పదమైనవే అని నిర్ధారణ అయితే ఎవరైనా మీ PAN వివరాలు ఉపయోగించి లోన్ అప్లై చేసి ఉండే అవకాశం ఉంది.
మోసపోతే ఏమి చేయాలి?
మీరు తీసుకోని లోన్ల వివరాలు రిపోర్టులో ఉన్నట్లయితే సంబంధిత బ్యాంకుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి.
మీ PAN డేటా మిస్‌యూజ్ అయిందని వివరించండి.
acknowledgment లేఖ తీసుకోండి.
పోలీస్ స్టేషన్‌కి వెళ్లి FIR నమోదు చేయండి
మోసం జరిగిందని రిజిస్టర్ చేస్తే భవిష్యత్తులో తగిన చర్యలు తీసుకోవచ్చు.
RBI Ombudsmanకు ఫిర్యాదు చేయండి
అవసరమైతే RBI అంబుడ్స్‌మన్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపించండి.
PAN కార్డు దుర్వినియోగాన్ని ఎలా నివారించాలి?
మీ PAN లేదా ఆధార్ నంబర్ ఎవరికీ వాట్సాప్‌లో షేర్ చేయవద్దు.
అనధికారిక వెబ్‌సైట్లలో మీ వివరాలు ఎప్పటికీ అప్‌లోడ్ చేయకండి.
రిటైల్ స్టోర్లలో పాన్ డేటా ఇచ్చే ముందు ఆ సంస్థ నిజమైనదేనా అన్నది ధృవీకరించుకోండి.
పాన్ కార్డు పోతే వెంటనే డూప్లికేట్ కోసం అప్లై చేసుకోండి. కొన్ని నెలల పాటు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను పర్యవేక్షించండి.
ఫైనాన్షియల్ యాప్‌లు, లోన్ అప్లికేషన్‌లకు బలమైన పాస్‌వర్డ్‌లతో పాటు 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ సెటప్ చేసుకోండి.
SMS లేదా Email నోటిఫికేషన్లు ఎప్పుడూ ఆన్‌లో ఉండేలా చూడండి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్.. నెస్లే సీఈఓ తొలగింపు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి