Top Pesticide Fruits: పురుగులమందులు ఎక్కువ ఉండేది ఈ పండ్లలోనే.. జర జాగ్రత్త..
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:42 PM
ఆరోగ్యానికి చాలా మంచివని ఈ 5 పండ్లను చిన్నాపెద్దా అందరూ విపరీతంగా తినేస్తుంటారు. కానీ, పురుగులమందులు అధిక మోతాదులో ఉండేది ఈ పండ్లలోనే. కాబట్టి, జర జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు పురుగుల మందులు లేకుండా పంటలు పండించే రైతులు అరుదు. మార్కెట్లో ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉండే పండ్లలో చాలా మటుకు పెస్టిసైడ్స్ చల్లి పండించినవే. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచివని ఈ 5 పండ్లను చిన్నాపెద్దా అందరూ విపరీతంగా తినేస్తుంటారు. కానీ, ఈ పండ్లలో 80 నుండి 99 శాతం విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ఇవి సరైన పద్ధతిలో శుభ్రపరచుకుని తినకపోతే ఆరోగ్యానికి హానికరంగా పరిణమించే ప్రమాదముంది. కాబట్టి, ఆ పండ్లు ఏవి? ఎలా శుభ్రపరుచుకుని తినాలి? అనే ప్రశ్నలకు డాక్టర్ల సలహా ఏంటో తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీ
అత్యధిక మొత్తంలో పురుగుమందులు ఉన్న పండు స్ట్రాబెర్రీ అని డాక్టర్లు అంటున్నారు. ఇందులో దాదాపు 99 శాతం పెస్టిసైడ్సే ఉంటాయి. నిజానికి, ఇది చాలా మృదువైన పండు. దీన్ని త్వరగా కీటకాలు లేదా ఫంగస్ దెబ్బతీస్తాయి. అందుకే ఇందులో ఎక్కువ పురుగుమందులు వాడతారు.
ద్రాక్ష
డాక్టర్ల ప్రకారం పురుగులమందులు అధికంగా ఉండే పండ్ల జాబితాలో ద్రాక్ష రెండవ స్థానంలో ఉంది. ద్రాక్ష పరిమాణం చిన్నదే కాక తొక్క కూడా చాలా సన్నగా ఉంటుంది. దీని కారణంగా పురుగుమందులు పండ్ల లోపలికి సులభంగా చేరుతాయి. వీటిని సరిగ్గా క్లీన్ చేసుకుని తినకపోతే ఆరోగ్యానికి చాలా హానికరం.
చెర్రీ
చెర్రీస్ లో కూడా పురుగుమందులు ఎక్కువగా ఉంటాయి. అవి చాలా మృదువుగా ఉండటం వల్ల త్వరగా చెడిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే ఎక్కువ కాలం నిల్వ ఉండాలని అధిక మొత్తంలో పురుగుమందులు వాడతారు.
ఆపిల్
మీరు ఆపిల్స్ ఆరోగ్యంగా ఉన్నాయని భావించి తింటుంటే జాగ్రత్త. వీటిలోనూ నిల్వ కోసం ఉపయోగించే రసాయనాలు అధిక మోతాదులో ఉంటాయని తెలుసుకోండి. ఆపిల్స్ షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఎక్కువ శాతంలో పురుగుమందులు కలుపుతారు. ఇలాంటివి ఆరోగ్యానికి చాలా ప్రమాదం.
బ్లూబెర్రీ
బ్లూబెర్రీస్‌లో కూడా చాలా పురుగుమందులు ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని వినే ఉంటారు. ఇదే కాక వీటిలో అధిక మొత్తంలో పురుగుమందులు కూడా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.
తినడానికి ముందు ఇలా చేయండి
మీరు పైనున్న పండ్లలో తినేముందు ఇలా చేస్తే ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడవని డాక్టర్లు సూచిస్తున్నారు.గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల వెనిగర్, అర చెంచా ఉప్పు వేయండి. ఈ నీటిలో పండ్లను కనీసం 10 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత వాటిని బాగా రుద్ది శుభ్రమైన నీటితో కడిగాక తినండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
మహిళల్లో ఈ అజాగ్రత్తల వల్ల థైరాయిడ్ ప్రమాదం.!
వామ్మో.. తిన్న తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే డయాబెటిస్‌కు సంకేతమా.!
For More Health News