Share News

AP News: డీజే.. గుండెలదిరే....

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:43 PM

‘డీజే’.. పెళ్లి ఊరేగింపులు జరగాలన్నా, రాజకీయ నాయకులకు స్వాగతం పలకాలన్నా, దేవుళ్లను ఊరేగించాలన్నా తప్పనిసరిగా ఇది ఉండాల్సిందే. మితిమీరిన శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజేలకు ప్రాధాన్యం ఎక్కువైంది.వీటి నుంచి వచ్చే అధిక శబ్దాలకు చిన్నారులు, వృద్ధులు గుండె సంబంధిత వ్యాధులున్న వారు భయంతో బిక్క చచ్చి పోతున్నారు.

AP News: డీజే.. గుండెలదిరే....

  • ఊరేగింపుల్లో హోరెత్తిస్తున్న డీజే పాటలు

  • భారీ సౌండ్‌తో వృద్ధులు, హృద్రోగులకు ప్రాణసంకటం

  • సౌండ్‌ 70 డెసిబెల్‌ దాటితే వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం

లింగపాలెం(అమరావతి): ‘డీజే’.. పెళ్లి ఊరేగింపులు జరగాలన్నా, రాజకీయ నాయకులకు స్వాగతం పలకాలన్నా, దేవుళ్లను ఊరేగించాలన్నా తప్పనిసరిగా ఇది ఉండాల్సిందే. మితిమీరిన శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజేలకు ప్రాధాన్యం ఎక్కువైంది.వీటి నుంచి వచ్చే అధిక శబ్దాలకు చిన్నారులు, వృద్ధులు గుండె సంబంధిత వ్యాధులున్న వారు భయంతో బిక్క చచ్చి పోతున్నారు. ప్రస్తుతం వినాయక చవితి(Vinayakachaviti) ఉత్సవాల సందర్భంగా వీటి వినియోగం ఎక్కువైంది.


డీజేల నుంచి వచ్చే విపరీత శబ్దాల వల్ల చెవిలో కర్ణభేరి ప్రభావితమై భవిష్యత్‌లో వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదముందని వైద్యులు చెపుతున్నారు. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులున్నవారు చనిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇటీవల కాలంలో డీజే శబ్దాలకు డ్యాన్స్‌ చేస్తూ మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయి. మనిషి చెవిలోని కర్ణభేరి సాధారణంగా 25 డెసిబెల్స్‌ శబ్దాలను మాత్రమే తట్టుకుంటుంది. 70 నుంచి 80 డెసిబెల్స్‌ వరకు శబ్దాలను వింటే వినికిడి శక్తి కోల్పోతారని ఈఎన్‌టీ వైద్యులు చెపుతున్నారు.


zzzZzzzzzzzzz.jpg

djఇక ఉత్సవాలలో ఊరేగింపుల్లో ఎంత శబ్దం వస్తుందో వాటివల్ల మనుషులకు ఎలాంటి నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 2015లో శబ్ద కాలుష్యంపై రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు భారీ శబ్దాలతో ఊరేగింపులు చెయ్యకూడదనే ఆదేశాలు ఉన్నా ఎక్కడ వాటి అమలు జరగడం లేదు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం నివాస ప్రాంతాలలో 50 డెసిబెల్స్‌ వరకు శబ్దం ఉండవచ్చని అది దాటితే మానవుల ఆరోగ్యానికి ప్రమాదమని చెపుతున్నా అధికారుల అలసత్వంతో ఉత్సవాలు, ఊరేగింపులలో 100 నుంచి 150 డెసిబెల్స్‌ వరకు డీ జే శబ్దాలు వినిపిస్తున్నాయి. అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని ధృష్టిలో ఉంచుకుని అధికారులు శబ్ద కాలుష్యాన్ని నివారించాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరోగ్యానికి తీపి కబురు

పడిగాపులు.. తోపులాటలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 02 , 2025 | 01:43 PM