Kakinada: బిల్డింగ్.. బిల్డప్.. కాకినాడలో అక్కరకు రాని రూ.5 కోట్ల బోట్ బిల్డింగ్ యార్డు
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:15 PM
కాకినాడలో రూ.5కోట్లతో నిర్మించిన బోటు బిల్డింగ్‌యార్డు ఎందుకు కొరగాకుండా పోయిం ది. అయిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోటంటే ఒక్క టి కూడా నిర్మాణం కాకుండా ఈసురోమంటోం ది. బోట్ల తయారీకి కావాల్సిన అన్నిరకాల సదు పాయాలు కల్పించాల్సిన అధికారులు అరకొరగా పనులు చేసి అందినకాడికి నొక్కేయడంతో దిష్టి బొమ్మలా మారింది.
- అయిదేళ్ల నుంచీ ఒక్క బోటంటే ఒక్కటి కూడా నిర్మించలేని దుస్థితి
- రూ.7కోట్లతో బోటు బిల్డింగ్ యార్డును ఆధునికీకరించేసినట్లు గత వైసీపీ సర్కారు బిల్డప్
- అప్పటి ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన, జిల్లా మంత్రులు ప్రారంభోత్సవం
- ఇప్పటికీ పూర్తవని భవనాలు, లేని మౌలిక సదుపాయాలు
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
కాకినాడలో రూ.5కోట్లతో నిర్మించిన బోటు బిల్డింగ్‌యార్డు ఎందుకు కొరగాకుండా పోయిం ది. అయిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోటంటే ఒక్క టి కూడా నిర్మాణం కాకుండా ఈసురోమంటోం ది. బోట్ల తయారీకి కావాల్సిన అన్నిరకాల సదు పాయాలు కల్పించాల్సిన అధికారులు అరకొరగా పనులు చేసి అందినకాడికి నొక్కేయడంతో దిష్టి బొమ్మలా మారింది. రూ.7కోట్లతో దీన్ని ఆధునికీ కరించేశామంటూ గత వైసీపీ సర్కారు బోటు బిల్డింగ్‌యార్డు గురించి 2020లో గొప్పగా డబ్బా కొట్టుకుంది. అసలిక్కడ సదుపాయాలేవీ లేకపోయినా మత్స్యకారులు ఎంచక్కాపడవలు తయారు చేసేసుకోవచ్చంటూ అప్పటి ఇన్‌ఛార్జిమంత్రి, ఇతర జిల్లా మంత్రులు గొప్పగా కలరింగ్ ఇచ్చా రు. తీరా ఇప్పటికీ ఇక్కడ పడవల తయారీకి ఏమాత్రం కనీస సదుపాయాలే లేవు.
బోట్ల తయారీకి అవసరమయ్యే భవనాలు, షెడ్లు, క్రేన్లు ఇలా ఏ మౌలిక సదుపాయం కూడా లే కుండా యార్డు వెక్కిరిస్తోంది. అధికారులేమో ఇ ప్పటివరకు రూ.5కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతుండగా కనీసం రూ.3కోట్ల విలువైన ప నులు జరిగినట్లు అసలు ఆనవాళ్లే లేవు. సిద్ధం కాని బోటు బిల్డింగ్ యార్డు సిద్ధమైనట్లు గత వైసీపీసర్కారు మత్స్యకారులను ముంచేసింది.
బిల్డింగ్ లేదు
కాకినాడ జగన్నాథపురం వంతెన సమీపంలో ని ఏటిమొగ నుంచి సముద్రం వరకు వందలా ది మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. వీ రంతా తమ బోట్లలో ఉప్పుటేరు కాలువ మీదు గా సముద్రంలోకి తరచూ వేటకు వెళ్లివస్తుంటా రు. ఈక్రమంలో మత్స్యకారులు ఎప్పటికప్పుడు తమ బోట్లకు మరమ్మతులు, కొత్త బోట్ల నిర్మా ణం, వలలకు మరమ్మతులకు వీలుగా ఎప్పుడో పురాతన కాలంనుంచి వస్తోన్న బోటు బిల్డింగ్ యార్డును వినియోగించుకుంటున్నారు. ఇది పూర్తిగా పాతబడిపోవడంతో 1993 నుంచీ అం దుబాటులో లేకుండా పోయింది. దీంతో మత్స్య కారులు బోట్ల మరమ్మతులు, కొత్తవాటి నిర్మా ణం అంతా ఆరుబయటే ఉప్పుటేరు కాలువ వెంబడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాడుబడి న భవనాన్ని కూలగొట్టి దాని స్థానంలో కొత్త బోటు బిల్డింగ్ యార్డు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రూ.7కోట్ల వరకు ఖర్చ వుతుందని అంచనావేశారు. ఈ నిధులతో ఇక్క డ 20వర్కుషాపులు, ఒకేసారి 18బోట్లు నిర్మిం చుకునే వసతి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదిం చారు. ఈనిధులను కాకినాడ స్మార్ట్‌సిటీ భరించ డానికి ముందుకువచ్చింది. పనులు ప్రారంభించి కొన్ని భవనాల నిర్మాణాన్ని ఏటిమొగలో 2020 లో ప్రారంభించింది. తీరా ఇవేవీ పూర్తికాకుం డానే గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా తన సొం త ప్రచారం కోసం బోటు బిల్డింగ్‌యార్డును వా డుకుంది. అసలు నిర్మాణాలే పూర్తికాని బోటు బిల్డింగ్‌యార్డును ఆధునికీకరించేశామంటూ ప్ర చారం చేసుకుంది.
అందులోభాగంగా 2020, న వంబరులో జిల్లాఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన కృష్ణ దాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంత్రు లు పినిపే విశ్వరూప్, కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ ఏటిమొగ కు వచ్చారు. బోటు బిల్డింగ్‌య యార్డును ఆధునికీకరించేశామని మత్స్యకారులు అందరూ వినియోగించుకోవచ్చని గొప్పగా డబ్బా కొట్టుకు న్నారు. తీరా ఇప్పటికి అయిదేళ్లవు తున్నా బోటు బిల్డింగ్ యార్డు అసలు పూర్తి కాలేదు. అక్కడ కేవలం ఓ రెండు షెడ్లతో కూడిన భవనాలు మినహా ఏవీ లేవు. అసలేమాత్రం సదుపాయా లు లేకపోవడంతో గడచిన అయిదేళ్లలో ఇక్కడ ఒక్క బోటు కూడా నిర్మాణం జరగలేదు. కానీ గత ప్రభుత్వం తాము మొత్తం ఆధునికీకరిం చేశామంటూ అబద్ధాలు చెప్పి మత్స్యకారులను మోసం చేసింది. ఇప్పటికీ ఇక్కడ ఏ సౌకర్యాలు లేక అనేకమంది మత్స్య కారులు ఉప్పుటేరు కాలువ వెంబడే బోట్ల నిర్మాణం,మరమ్మతులు చేసుకోవాల్సి వస్తోంది.
పూర్తవకుండానే కట్టబెట్టేశారు
ఒకపక్క బోటు బిల్డింగ్ యార్డు నిర్మాణానికి రూ.7కోట్లుఖర్చవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేసి హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు పని అప్పగించారు. సదరు కాంట్రాక్టరు ఇక్కడ రెండు షెడ్లు నిర్మించి వదిలేశాడు. వాస్తవానికి బోట్ల తయారీ, మరమ్మతు చేయాలంటే యార్డు లో భారీ క్రేన్లు ఉండాలి. ఉప్పుటేరు నుంచి బోటును యార్డులోకి, యార్డులో తయారైన బో టు ఉప్పుటేరులోకి దించడానికి క్రేన్లు, ట్రాక్ ఉం డాలి. కానీ ఇప్పటికీ ఇక్కడ అవేవీ లేవు. బోటు నిర్మాణానికి అయ్యే చెక్కకు సంబంధించి సామి ల్లు, విడిభాగాల దుకాణాలు అందుబాటులో ఉండాలి. కానీ అవేవీ లేకపోవడంతో బోట్ల నిర్మాణానికి ఇప్పటికీ ఎవరూ రావడంలేదు.
ఈ భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్‌కు రూ.20 లక్ష ల వరకు బిల్లులు బాకీ ఉండడంతో మిగిలిన పనులు చేయకుండా వదిలేశాడు. ఇప్పటివరకు దీని నిర్మాణానికి రూ.5కోట్లు ఖర్చుచేసినట్లు స్మార్ట్‌సిటీ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. తీరా క్షేత్రస్థాయిలో షెడ్ల నిర్మాణానికి వెచ్చిం చింది రూ.3కోట్లు కూడా కనిపించడం లేదు. ఇ దంతా ఒకెత్తయితే అసలింకా బోటు బిల్డింగ్ యార్డు ఒకపక్క పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. కనీస వసతులు కూడాలేవు. అయినా అధికారు లు అప్పటి ప్రభుత్వ మెప్పు కోసం అడ్డదిడ్డంగా వ్యవహరించారు. బోటు బిల్డింగ్ యార్డును ఆప రేషన్, మెయింటెనెన్స్, మేనేజ్‌మెంట్(ఓఎంఎం) విధానంలో అయిదేళ్లపాటు నిర్వహించడానికి 2021, మేలో ఏకంగా టెండర్లు పిలిచేశారు. యార్డు దక్కించుకున్న సంస్థ పనితీరు బాగుంటే ఐదేళ్లతోపాటు మరో రెండేళ్ల వ్యవధి పొడిగి స్తామని టెండర్ నిబంధనల్లో ప్రస్తావించారు.
యార్డులో బోట్లు తయారు చేసుకునే మత్స్యకా రులకు ప్రత్యేకంగా రాయితీలు ప్రకటించారు. బోట్లు తయారు చేసుకునేందుకు షెడ్లు విని యోగించుకుంటే నెలకు స్క్వేర్ మీటర్ అద్దె సాధారణ వ్యాపారులకు రూ.100 అయితే మ త్స్యకారులకు రూ.50 వసూలు చేయాలని నిబం ధన విధించారు.షెడ్లలో 40శాతం స్థలం మత్స్య కారులకు కేటాయించాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీ ఆ తర్వాత దీని నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేసింది. సదుపాయాలు లేక బోట్ల తయారీ, మరమ్మతు లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇటు వైపు చూడడమే మానేసింది. దీంతో ఇప్పటికీ ఇది నిరుపయోగంగా మారింది. టెండర్ పొంది న కంపెనీని రద్దు చేసి దీన్ని వినియోగంలోకి తీసుకువచ్చి సదుపాయాలు కల్పిస్తేనే ఎంతో కొంత మత్స్యకారులకు ఉపయోగం.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News