Perni Nani Meets Mithun Reddy: రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పేర్ని నాని ములాఖత్
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:02 PM
రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
రాజమండ్రి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో (Mithun Reddy) మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని (Perni Nani) ఇవాళ(మంగళవారం) ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో పేర్నినాని మాట్లాడారు. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని.. ఇవాళ ఆయనను పరామర్శించానని చెప్పుకొచ్చారు. మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసి 40 రోజులు అయ్యిందని, ఒక్క రోజు కూడా కస్టడీకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు పేర్ని నాని.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని మానసింగా కుంగదీసేందుకే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కాంలో సహా ముద్దాయిలు చెప్పిన ప్రకారం మిథన్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జైల్లో ఉంచినా మిథున్ రెడ్డి కుంగిపోయేది లేదని స్పష్టం చేశారు. మిథున్ రెడ్డి బయటకు వచ్చాక రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపాలపై తిరుగుబాటు చేస్తారని పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు.
మిథున్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా..
మరోవైపు.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి(బుధవారం) వాయిదా వేసింది. అలాగే, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. మిథున్‌రెడ్డికి జైల్లో సౌకర్యాలపై జైళ్ల శాఖ రివ్యూ పిటిషన్‌పై రేపు(బుధవారం) విచారణ జరిపి ఆదేశాలు ఇస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్ సహకారం మరువలేనిది: సీఎం చంద్రబాబు
మాదక ద్రవ్య రహిత ఏపీ మా లక్ష్యం: అనిత
For More AP News And Telugu News