Share News

Nestle CEO: కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్.. నెస్లే సీఈఓ తొలగింపు

ABN , Publish Date - Sep 02 , 2025 | 08:49 AM

కిందిస్థాయి సిబ్బందితో ఎఫైర్ ఉన్నందుకు నెస్లే సంస్థ సీఈఓ ఫ్రెక్సీ ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు జరిపిన సంస్థ యాజమాన్యం ఆయనను తొలగించామని ఓ ప్రకటన విడుదల చేసింది.

Nestle CEO: కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్.. నెస్లే సీఈఓ తొలగింపు
Nestlé CEO fired

ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసులో రొమాంటిక్ వ్యవహారం నడిపిన మరో సీఈఓ కొంప మునిగింది. తన కింది ఉద్యోగితో సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌ పెట్టుకున్నందుకు నెస్లే సీఈఓ లారెంట్ ఫ్రెక్సీని సంస్థ విధుల నుంచి తొలగించింది. ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు తరువాత సీఈఓను సాగనంపింది.

సంస్థ నియమావళి ఉల్లంఘించినందుకు ఫ్రెక్సీని తొలగించినట్టు నెస్లే సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో జరిపిన అంతర్గత దర్యాప్తులో ఫ్రెక్సీ సంబంధం గురించి తెలిసినట్టు పేర్కొంది. ఈ దర్యాప్తును సంస్థ చైర్మన్ పాల్ బల్కీ స్వయంగా పర్యవేక్షించారని తెలిపింది. సీఈఓను తొలగించకతప్పలేదని చైర్మన్ పాల్ బల్కీ పేర్కొన్నారు. నెస్లే పాలన వ్యవస్థ మాత్రం యథాతథంగా కొనసాగుతోందని చెప్పారు. నైతిక విలువలు, పరిపాలనా విధానమే సంస్థకు బలమైన పునాదులని వ్యాఖ్యానించారు.

కాగా, ఫ్రెక్సీ స్థానాన్ని నెస్లే సీనియర్ ఉద్యోగి ఫిలిప్ నవ్రాటిల్ భర్తీ చేయనున్నారు. 2001లో నవ్రాటిల్ ఇంటర్నల్ ఆడిటర్‌గా సంస్థలో చేరారు. సెంట్రల్ అమెరికా కార్యకలాపాలకు సంబంధించి పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2020లో సంస్థకు చెందిన కాఫీ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్‌కు బదిలీ అయ్యారు. 2024లో నెస్లే నెస్‌ప్రెస్సో విభాగం బాధ్యతలు చేపట్టారు.


స్విట్జర్లాండ్‌కు చెందిన ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే కొంత కాలంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సుంకాలు, పెరుగుతున్న ముడిసరుకు ధరలు సంస్థకు ఇబ్బందికరంగా మారాయి. కాఫీ, కొకోవా గింజలు వంటి ముడిసరుకుల ధరల పెరిగినప్పటికీ తుది ఉత్పత్తలు ధరలు కూడా పెరగడంతో సంస్థపై కొంత భారం తగ్గిందని నెస్లే జులైలో పేర్కొంది.

ఇటీవల ఆస్ట్రానమర్ సంస్థ సీఈఓ యాండీ బ్రయన్ కూడా దాదాపు ఇదే రీతిలో ఉద్యోగం పోగొట్టుకున్న విషయం తెలిసిందే. హెచ్ ఆర్ విభాగం అధిపతితో ఆయనకున్న వివాహేతర సంబందం ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌లో బయటపడింది. హెచ్ఆర్ అధిపతిని కౌగిలించుకున్న సమయంలో ఆయన స్టేడియంలోని కెమెరా కంటికి చిక్కారు. దీంతో, వెంటనే తల పక్కకు తిప్పుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో చివరకు షాక్ తప్పలేదు.


ఇవి కూడా చదవండి

జీఎస్‌టీ వసూళ్లు రూ 1.86 లక్షల కోట్లు

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 11:12 AM