JP Nadda Fires on YSRCP: వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలింది: జేపీ నడ్డా
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:31 PM
వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ (YSRCP) హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) విమర్శించారు. ఇవాళ (ఆదివారం) విశాఖపట్నంలో బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడారు. బీజేపీ సారథ్యం యాత్ర విజయవంతంగా సాగిందని ఉద్ఘాటించారు.
వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని చెప్పుకొచ్చారు. ఎన్డీయే పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని నొక్కిచెప్పారు. 2014కు ముందు దేశంలో అసమర్థ, వారసత్వ ప్రభుత్వాలు ఉండేవని విమర్శించారు. 2014 తర్వాత దేశంలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని జేపీ నడ్డా సూచించారు. వైఎస్ జగన్ అక్రమాలు మొత్తం బయటపెడతామని జేపీ నడ్డా హెచ్చరించారు.
11 ఏళ్లలో ఇచ్చిన మాటను అమలు చేశాం..
‘విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్‌కి మణిహారం లాంటిది. నరేంద్రమోదీ అధికారంలోకి రాక ముందు అవినీతి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడిచేది. వైసీపీ అసమర్థ, అస్తవ్యస్త ప్రభుత్వాన్ని కూలదోసి కూటమిని ఎంచుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు. మిగిలిన రాజకీయ పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పడితే.. బీజేపీ సిద్ధాంతం మీద, కేడర్ మీద ఆధారపడుతోంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ 26 జిల్లాలో సారథ్యం యాత్ర చేశారు. ఈ సందర్భంగా మాధవ్, బీజేపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు. 11 ఏళ్లలో ఇచ్చిన మాటను అమలు చేశాం’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు.
బీజేపీ ఐడియోలాజికల్ పార్టీ...
‘బీజేపీ ఒక ఐడియోలాజికల్ పార్టీ. ప్రపంచంలోనే అత్యధిక మంది కార్యకర్తలు బీజేపీలోనే ఉన్నారు. ఆర్టికల్ 370, అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ట్రిపుల్ తలాక్ ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాం. 11వ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఉండేది. ఇప్పుడు నాల్గోవ లార్జెస్ట్ ఎకానమీగా అవతరించింది. భవిష్యత్‌లో మూడోదిగా అవతరిస్తుంది. డిఫెన్స్, మెడికల్ అనేక రంగాల్లో మేము ముందుకు వెళ్తున్నాం. ఏపీలో చంద్రబాబు నాయకత్వం, మోదీ సహకారంతో కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది. వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలు, అరాచక పాలన ఉంది. అంధకారంలోకి వెళ్లిన ఏపీని మోదీ, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. మోదీ మదిలో ఏపీ ఉంటుంది. ఏపీ ప్రజల మదిలో మోదీ ఉంటారు’ అని జేపీ నడ్డా ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
నవయువతకు ప్రేరణ.. అబ్బురపరుస్తున్న దుర్గేశ్ విన్యాసాలు
Read Latest Andhra Pradesh News and National News