Share News

Somireddy VS Kakani: దోపిడీ చేయడంలో కాకణికి డాక్టరేట్ ఇవ్వాలి.. సోమిరెడ్డి విసుర్లు

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:31 PM

సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత కాకాణికి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కాకాణికి సిగ్గు, శరం లేదని విమర్శించారు. త్వరలో కాకణి భూ దోపిడీని ఆధారాలతో సహా బయట పెడుతానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.

Somireddy VS Kakani: దోపిడీ చేయడంలో కాకణికి డాక్టరేట్ ఇవ్వాలి..  సోమిరెడ్డి విసుర్లు
Somireddy Fires on Kakani Govardhan Reddy

నెల్లూరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో జగన్ అండ్ కో రూ.3 వేల కోట్లు దోచుకున్నారని మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం అని చెప్పి 30వేల మంది మహిళల తాళ్లు తెంచిన ఘనత వైసీపీదేనని ఆక్షేపించారు. ఇవాళ(గురువారం) నెల్లూరులో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాకాణి గోవర్థన్‌రెడ్డికి (Kakani Govardhan Reddy) టీడీపీని, తనను తిట్టందే తిన్నది అరగదని... తిన్నది అరగక ఆపరేషన్ చేయించుకున్నది కాకణినేనని ఎద్దేవా చేశారు.


కాకాణి, రామిరెడ్డిపై ఎనిమిది కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) గురించి మాట్లాడే నైతిక అర్హత కాకాణికి లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు సంక్షేమం, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సభను ప్రజలు విజయవంతం చేశారని చెప్పుకొచ్చారు. నెల్లూరులో సాగరమాల నేషనల్ హైవే రోడ్డు పనులు అద్భుతంగా జరుగుతున్నాయని వివరించారు. ఏఎంఆర్, మేకపాటి కుటుంబ సభ్యులు నిజాయితీగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గ్రావెల్, ఇసుకకు వారు డబ్బులు కట్టి తోలుకుంటున్నారని స్పష్టం చేశారు. ఆ నిర్మాణ పనులను వైసీపీకి చెందిన వ్యక్తులే చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. కాకాణికి సిగ్గు, శరం లేదని విమర్శించారు. త్వరలో కాకణి చేసిన భూ దోపిడీని ఆధారాలతో సహా బయట పెడుతానని హెచ్చరించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.


కాకాణివి నిరాధార ఆరోపణలే..

‘కాకాణివి అన్ని నిరాధార ఆరోపణలే. ఆయన చేసిన అవినీతి, అన్యాయాల నుంచి తప్పించుకోలేడు. కాకాణికి అవినీతి, అక్రమాలు, దోపిడీల్లో పీహెచ్‌డీ చేసిన అనుభవం ఉంది. కాకణి 204 రోజులు పోలీసుల నుంచి తప్పించుకొని తిరిగి ఆజ్ఞాతంలో ఉన్నారు. అలాంటి వ్యక్తిని వైసీపీ నెల్లూరు జిల్లా (Nellore District) అధ్యక్షుడుగా జగన్ మోహన్ రెడ్డి చేశారు. కాకణికి దోపీడీలో పీహెచ్‌డీ క్రింద డాక్టరేట్ ఇవ్వాలి. పుచ్చలపల్లి, నల్లపురెడ్డి, నేదురుమల్లి, బెజవాడ లాంటి నేతలు ఏలిన నెల్లూరు జిల్లాలో.. కాకాణి లాంటి వారిని చూడాల్సి వస్తోంది. మేము అధికారంలోకి వస్తే అని కూటమి నేతలను కాకణి బెదిరిస్తున్నాడు.. మేము భయపడం. కోర్టు ఆర్డర్‌ను కాకణి లెక్క చెయడం లేదు.. ఆయన బెయిల్‌‌ను వెంటనే రద్దు చేయాలి’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 11 , 2025 | 12:52 PM