Kesineni Shivnath On Thiruvur TDP Issue: తిరువూరు టీడీపీ ఇష్యూపై స్పందించిన కేశినేని శివనాథ్
ABN , Publish Date - Oct 23 , 2025 | 09:40 PM
తిరువూరు టీడీపీ ఇష్యూపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తాను టీడీపీలో క్రమ శిక్షణగల నాయకుడినని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా (జగ్గయ్యపేట), అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): తిరువూరు టీడీపీ ఇష్యూ (Thiruvur TDP issue)పై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Shivnath) స్పందించారు. ఇవాళ(గురువారం) జగ్గయ్యపేటలో కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీలో క్రమశిక్షణగల నాయకుడినని స్పష్టం చేశారు. తాను టీడీపీలో ఓ కార్యకర్తనని.. అధిష్ఠానం మాట జవదాటనని క్లారిటీ ఇచ్చారు. తిరువూరు విషయం అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. వైసీపీ అనుచరుడిగా తాను లేనని స్పష్టం చేశారు. ఎవరి పీఏ ఎవరికీ డబ్బులు ఇచ్చారో నిరూపించాలని కేశినేని శివనాథ్ సవాల్ విసిరారు.
అయితే, తిరుపూరు టీడీపీ నేతల ఇష్యూపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పందించారు. నేతలు క్రమశిక్షణ దాటితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేతల మధ్య సమన్వయం ఉండాలని.. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దుబాయ్‌లో పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం వరుసగా భేటీ అవుతున్నారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పర్యటిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఇలాంటి రాజకీయ సమస్యలు లేవనెత్తడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావుని అడిగి తిరుపూరు ఇష్యూపై చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. తిరుపూర్ ఇష్యూపై దుబాయ్ నుంచి ఏపీకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు
Read Latest AP News And Telugu News