Share News

Telugu States Reservoirs: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జలాశయాలకు భారీగా వరద నీరు

ABN , Publish Date - Aug 11 , 2025 | 09:16 AM

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు భారీగా వరద చేరుకుంది. వరద చేరుకోవడంతో పలు ప్రాజెక్ట్‌ల గేట్లు తెరిచారు. హిమాయత్ సాగర్, తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం జలాశయాల్లో భారీగా వరద ప్రవహిస్తోంది.

 Telugu States Reservoirs: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జలాశయాలకు భారీగా వరద నీరు
Telugu States Reservoirs

హైదరాబాద్, కర్నూల్, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణలలో (Telangana) భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంది. వరద చేరుకోవడంతో పలు ప్రాజెక్ట్‌ల గేట్లు తెరిచారు. హిమాయత్ సాగర్, తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం జలాశయాల్లో భారీగా వరద ప్రవహిస్తోంది. ఈ జలాశయాల దగ్గర ప్రస్తుత నీటి పరిస్థితి ఇలా ఉంది.


హిమాయత్ సాగర్‌కు పెరిగిన వరద...

హిమాయత్ సాగర్‌కు (Himayat Sagar) వరద నీరు మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగింది. వరద నీరు పెరగడంతో రెండో గేట్‌ను మూడు ఫీట్ల మేర ఎత్తారు. ఇప్పటి వరకు ఒక్క గేటు మాత్రమే అధికారులు తెరిచి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా 1400 క్యూసెక్కుల నీటిని అధికారులు మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్‌‌ చేరువలోకి నీటి మట్టం చేరుకుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు కాగా.. 1762.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 1,700 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,400 క్యూసెక్కులుగా ఉంది.


శ్రీశైలం జలాశయానికి భారీ వరద

మరోవైపు.. నంద్యాల జిల్లాలోని మిడ్తూర్‌లో భారీ వర్షం కురిసింది. ఉధృతంగా వాగు ప్రవహిస్తోంది. నందికొట్కూరు నుంచి నంద్యాలకు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) భారీ వరద కొనసాగుతోంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

శ్రీశైలం జలాశయం వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది..

ఇన్ ఫ్లో : 1,53,098 క్యూసెక్కులు,

ఔట్ ఫ్లో : 65,800 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు

ప్రస్తుతం : 881.20 అడుగులు

పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.8070

ప్రస్తుత నీటి నిల్వ : 194.3096 టీఎంసీలు


తుంగభద్ర డ్యామ్‌కు వరద ప్రవాహం

అలాగే, కర్నూలు జిల్లాలోని తుంగభద్ర డ్యామ్‌కు (Tungabhadra Dam) వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ డ్యామ్‌ 4 గేట్లు ఎత్తారు.

తుంగభద్ర డ్యామ్‌ వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది..

పూర్తిస్థాయి నీటిమట్టం: 1633 అడుగులు

ప్రస్తుతం నీటి మట్టం: 1626.06 అడుగులు

ఇన్ ఫ్లో : 30,689 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో : 31,775 క్యూ సెక్కులు

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 105 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం: 80 003 టీఎంసీలు


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో జగన్‌ మేనమామ రాజకీయం

ఏపీలో తెలంగాణ మంత్రులు

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 09:27 AM