Share News

Cyclone Montha: మొంథా తుపాన్.. మంత్రి సత్యకుమార్‌కి కేంద్రమంత్రి జేపీ నడ్డా ఫోన్

ABN , Publish Date - Oct 27 , 2025 | 10:11 PM

ఏపీలో మొంథా తుపాను ప్రభావంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా ఆరా తీశారు. ఈ మేరకు ఏపీ వైద్యా, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

Cyclone Montha: మొంథా తుపాన్.. మంత్రి సత్యకుమార్‌కి కేంద్రమంత్రి జేపీ నడ్డా ఫోన్
Satyakumar Yadav

అమరావతి, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): ఏపీలో మొంథా తుపాను ప్రభావంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా (JP Nadda) ఆరా తీశారు. ఈ మేరకు ఏపీ వైద్యా, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ (Satyakumar Yadav) యాద‌వ్‌కు ఇవాళ(సోమవారం) ఫోన్ చేసి జేపీ న‌డ్డా వివరాలు తెలుసుకున్నారు. మొంథా ప్రభావం ఏపీలోని 17 జిల్లాల‌పై క‌నిపించే అవ‌కాశ‌ముంద‌ని మంత్రి సత్య కుమార్ తెలిపారు. తుపాను ప్రభావాన్ని స‌మ‌ర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని వెల్లడించారు. వైద్యా ఆరోగ్య శాఖ కూడా ముంద‌స్తు జాగ్రత్తతో అవ‌స‌ర‌మైన చోట్ల ప్రజ‌ల‌కు సేవలందించేలా కార్యాచరణ చేపట్టిందని వివరించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధ‌వ్‌తో క‌లిసి తుపాను స‌హాయ‌క చ‌ర్యల్లో పాల్గొనేలా పార్టీ శ్రేణుల‌కు పిలుపునివ్వాల‌ని జేపీ నడ్డా సూచించారు.


గర్భిణుల రక్షణ కోసం చర్యలు: మంత్రి స‌త్యకుమార్

మరోవైపు.. మొంథా తుపాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యల్లో భాగంగా గర్భిణుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్‌ పేర్కొన్నారు. ప్రసవ తేదీకి వారం రోజుల వ్యవధి కలిగిన సుమారు 787 మంది గర్భిణులను సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులకు తరలించామని తెలిపారు. పునరావాస కేంద్రంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గర్భిణులకి సంబంధించి ఏఎన్ఎంల నుంచి సమాచారం సేకరించామని వివరించారు. హైరిస్కులో ఉన్న గర్భిణుల విషయంలో వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటున్నారని మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. పాలక మండలి విజ్ఞప్తి

మొంథా తుపానుపై పవన్ కల్యాణ్ అలర్ట్.. అధికారులకు దిశానిర్దేశం

Read latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 10:24 PM