Rain Alert in AP: రెయిన్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 08:17 PM
వాతావరణంలో నెలకొన్న పరిస్థితులతో ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించారు.
అమరావతి, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో నెలకొన్న పరిస్థితులతో ఏపీ (Andhra Pradesh)లో మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ (PrakharJain) తెలిపారు. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో.. సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించారు ఎండీ ప్రఖర్‌జైన్.
ఆవర్తనం ప్రభావంతో రేపు (బుధవారం) కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. అలాగే ఏపీలోని మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఎండీ ప్రఖర్‌జైన్.
నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో ఎల్లుండి(గురువారం) అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల కింద నిలబడ వద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రహదారుల నాణ్యతలో రాజీపడబోం.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
Read Latest AP News And Telugu News