AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రూ.4వేల కోట్ల భారీ అవినీతి వెలుగులోకి..
ABN , Publish Date - Sep 19 , 2025 | 09:22 PM
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. PMLA కింద ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు. దేశ వ్యాప్తంగా 20 ప్రదేశాల్లో సోదాలు చేశారు.
అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. PMLA కింద ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు (ED officials). దేశవ్యాప్తంగా 20 ప్రదేశాల్లో సోదాలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రూ.4వేల కోట్లు ఏపీ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ఈడీ అధికారుల విచారణలో వెల్లడైంది. సీఐడీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. పథకం ప్రకారమే ప్రధాన బ్రాండ్ల పేరు మీదుగా కొత్త బ్రాండ్లను తీసుకువచ్చి నిందితులు లిక్కర్ స్కామ్ చేసినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు.
కొత్త బ్రాండ్ల ప్రమోషన్లలో నిందితులు పాల్గొన్నారని పేర్కొన్నారు సీఐడీ అధికారులు. నిన్న(గురువారం) జరిగిన ఈడీ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ సోదాల్లో లెక్క చూపని రూ.38లక్షలను సీజ్ చేశారు. ఈ క్రమంలో 2019 నుంచి 2024 మధ్య అమల్లో ఉన్న కొత్త లిక్కర్ పాలసీలో అవినీతి జరిగినట్లు గుర్తించారు. మెక్‌డావెల్స్, రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ వంటి బ్రాండ్లకు కిక్‌బ్యాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. నకిలీ బ్రాండ్లు ప్రోత్సహించి సరఫరాదారుల నుంచి 15 నుంచి 20 శాతం మేర కిక్‌బ్యాక్ వసూలు చేసినట్లు గుర్తించారు.
ఆటోమేటెడ్ సిస్టమ్‌ని తొలగించి మాన్యువల్ ఆర్డర్లతో అవినీతికి పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. బోగస్ ఇన్వాయిసులు, ఫేక్ ట్రాన్స్‌పోర్ట్ చలాన్లు, డమ్మీ కంపెనీల ద్వారా డబ్బు తరలించారని అధికారులు తెలిపారు. ఆభరణాల వ్యాపారుల ద్వారా బంగారం, నగదు రూపంలో కిక్‌బ్యాక్ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. దుబాయ్‌లో తలదాచుకున్న నిందితుల దగ్గరి నుంచి ఆధారాలు సేకరించారు ఈడీ అధికారులు. వారి దగ్గరి నుంచి రూ.38 లక్షల నగదు, కోట్ల విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.175కోట్ల విలువైన బంగారు నాణేలు ఎవరి కోసం?.. బ్లాక్ మనీని వైట్‌గా మార్చి..
జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు
Read Latest AP News And Telugu News