YSRCP MLCs join TDP: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:29 PM
వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు.. బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ ఇవాళ(శుక్రవారం) అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ముగ్గురు నేతలు గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీకి చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇటీవలే తమ పార్టీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. కాగా, వారి రాజీనామా లేఖలు శాసనమండలి ఛైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.
టీడీపీతోనే అభివృద్ధి..
పార్టీ మారిన సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసే టీడీపీలో చేరామన్నారు. ఆరు నెలలుగా కౌన్సిల్ చైర్మన్ తమ రాజీనామాలు ఆమోదించలేదని, దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందని పేర్కొన్నారు.
సొంత గూటికి వచ్చినట్టు ఉంది
టీడీపీలో చేరడం సొంత గూటికి వచ్చినట్టు ఉందని బల్లి కల్యాణ్ పేర్కొన్నారు. తన నాన్న పూర్తికాలం టీడీపీతోనే ఉన్నారని, బేషరతుగానే టీడీపీలో చేరామని కల్యాణ్ స్పష్టం చేశారు.
ఏమీ చేయలేకపోయాం
వైసీపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి ఏడాది ముగిసిందన్నారు కర్రి పద్మశ్రీ. పదవి ఉన్నా ప్రజలకు పెద్దగా ఏమీ చేయలేకపోయామని, వైసీపీ కనీసం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:
జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..
అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్‌లో మృతి
For More Latest News