Singer Zubeen Garg Dies: 'యా అలీ' పాట.. అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్‌లో మృతి
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:13 PM
'యా అలీ' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన, అస్సాం లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ హఠాన్మరణం చెందారు. సింగపూర్‌లో ఫ్రీక్ స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయారు. ఆయన వయసు 52 సంవత్సరాలు.
ఢిల్లీ: 'యా అలీ' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అస్సాం లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ హఠాన్మరణం చెందారు. ఇవాళ (శుక్రవారం) ఆయన సింగపూర్‌లో ఫ్రీక్ స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ మరణించారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. 90వ దశకంలో అస్సాంలో ఖ్యాతిగాంచిన జుబీన్.. 2006లో తన పాట 'యా అలీ' విజయంతో జాతీయ స్థాయిలో పేరుపొందారు. జుబీన్ మరణవార్త అస్సాంలో అన్ని వర్గాల వారినీ కలవరపాటుకు గురిచేస్తోంది. రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు, అభిమానులు జుబీన్ మృతిపై శోకతప్త హృదయాలతో స్పందిస్తున్నారు.
మరణ వార్త తెలిసిన వెంటనే గార్గ్ ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు, బంధుమిత్రులు చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి