PM Kisan Samman Nidhi Yojana: రైతన్నలూ ఇది చేశారా..? లేకపోతే డబ్బులు కోల్పోతారు..!
ABN , Publish Date - Sep 19 , 2025 | 03:09 PM
మీరు రైతా..? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి దరఖాస్తు చేశారా? ఈ కేవైసీ, భూమి ధృవీకరణ పూర్తి చేశారా? అయినప్పటికీ డబ్బులు పడటం లేదా? అయితే, మీరు ఖచ్చితంగా ఈ తప్పు చేస్తున్నట్లే.
PM Kisan 21st installment: మీరు రైతా..? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి దరఖాస్తు చేశారా?. ఈ-కేవైసీ, భూమి ధృవీకరణ పూర్తి చేశారా? అయినప్పటికీ డబ్బులు పడటం లేదా?. అయితే, మీరు కచ్చితంగా ఈ తప్పు చేస్తున్నట్లే. అవును, ఆ చిన్న తప్పిదం వల్ల రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రయోజనాన్ని పొందలేదరు. మరి ఆ తప్పులు.. ఈ పథకం నిధులు పొందాలంటే రైతులు ఏం చేయాలనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అంతకంటే ముందుగా ఈ పథకం గురించి తెలుసుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటకాలం సమయంలో ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా అర్హులైన రైతులందరికీ ఏటా రూ. 6,000 అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదికి మూడుసార్లు అంటే రూ. 2వేలు చొప్పున మొత్తం రూ. 6 వేలు విడుదల చేస్తోంది. ఈ డబ్బును నేరుగా రైతుల అకౌంట్‌లోనే జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 విడతలుగా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. మరికొద్ది రోజుల్లో 21 విడత నిధులను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది మోదీ సర్కార్. మరి ఈ విడతకు సంబంధించి డబ్బులను రైతులు పొందాలంటే ఖచ్చితంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఆ పనులు పూర్తి చేయకపోతే రైతుల ఖాతాల్లో డబ్బులు పడవు. మరి రైతులు ఏం చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం.
రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే డబ్బులను పొందాలంటే ముందుగా తమ భూమిని ధృవీకరించాలి. ఆ తరువాత ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఇవి పూర్తి చేయకపోతే ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు. అయితే, ఈ రెండూ పూర్తి చేసిన రైతులు కూడా ఒక్కోసారి ఈ పథకం నిధులను పొందలేకపోతున్నారు. ఇందుకు కారణం.. డీబీటీ ని పూర్తి చేయకపోవడం. అవును, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే నిధులను జమ చేస్తోంది. అందుకే ఈ డబ్బులు అకౌంట్‌లో పడాలంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్(DBT) ప్రాసెస్‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. భూమి ధృవీకరణ, ఈకేవైసీ, డీబీటీ ప్రాసెస్ పూర్తి చేసిన రైతులకు వారి అకౌంట్‌లో పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి.
డీబీటీ ఎందుకు..?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తోంది. ఇలా డైరెక్ట్ ఫండింగ్ కోసం బ్యాంకుల్లో డీబీటీ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతుల బ్యాంక్ అకౌంట్‌కు డీబీటీ ఆప్షన్‌ను యాక్టీవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందలేరు.
డీబీటీ ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలి..?
1. రైతు ముందుగా మీ అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు వెళ్లాలి.
2. బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి సంబంధిత పత్రాలను రైతు తన వెంట తీసుకెళ్లాలి.
3. అక్కడ సంబంధిత అధికారినికి కలవాలి.
4. బ్యాంకు అధికారులకు విషయాన్ని తెలియజేయాలి.
5. మీ డాక్యూమెంట్స్ వారికి చూపిస్తే.. అధికారులు మీ బ్యాంక్ అకౌంట్‌లో డీబీటీ ఆప్షన్‌ను యాక్టివేట్ చేస్తారు.
6. దీంతో మీ పని పూర్తవుతుంది.
7. ఇప్పుడు ఈకేవైసీ, భూమి ధృవీకరణ, డీబీటీ యాక్టివేట్ చేసినందున ఈ పథకం ప్రయోజనాలు పొందుతారు.
Also Read:
PM Modi Plants Kadamb Sapling: బర్త్‌డే గిఫ్ట్.. కదంబ్ మొక్కను నాటిన ప్రధాని మోదీ
Sam Pitroda: పాక్ వెళ్లినప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టుంది.. శామ్ పిట్రోటా వ్యాఖలపై బీజేపీ గరంగరం
For More National News and Telugu News..