Share News

PM Modi Plants Kadamb Sapling: బర్త్‌డే గిఫ్ట్.. కదంబ్ మొక్కను నాటిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Sep 19 , 2025 | 02:54 PM

బర్త్ డే గిఫ్ట్‌గా వచ్చిన కదంబ్ మొక్కను స్వయంగా నాటారు ప్రధాని మోదీ. UK రాజు చార్లెస్ III ప్రత్యేక బహుమతిగా ఇచ్చిన ఈ మొక్కను 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో ప్రధాని నాటారు.

PM Modi Plants Kadamb Sapling: బర్త్‌డే గిఫ్ట్.. కదంబ్ మొక్కను నాటిన ప్రధాని మోదీ
PM Modi Plants Kadamb Sapling

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: బర్త్ డే గిఫ్ట్‌గా వచ్చిన కదంబ్ మొక్కను స్వయంగా నాటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. UK(యునైటెడ్ కింగ్‌డమ్) రాజు చార్లెస్ III (King Charles III) ప్రత్యేక బహుమతిగా ఇచ్చిన ఈ కదంబ్ మొక్కను 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో ప్రధాని నాటారు. రెండు దేశాల మధ్య స్నేహం, పర్యావరణ పరిరక్షణ పట్ల ఉమ్మడి నిబద్ధతను ఈ మొక్క సూచిస్తోంది. సెప్టెంబర్ 17 బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కింగ్ చార్లెస్ ఈ మొక్కను బహుమతిగా అందజేశారు.


ఇంగ్లాండ్ రాజు చార్లెస్ సమర్పించిన ఈ కదంబ్ మొక్క ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తాజా నినాదం 'ఏక్ పెడ్ మా కే నామ్'(Ek Ped Maa Ke Naam) నుంచి ప్రేరణ పొందటం విశేషం. బుధవారం నాడు బ్రిటిష్ హైకమిషన్ సోషల్ మీడియా మాద్యమం ఎక్స్ ద్వారా ఈ గిఫ్ట్ గురించి వివరించింది. 'భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజున కదంబ్ మొక్కను పంపడం పట్ల కింగ్ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధాని మోదీ 'ఏక్ పెడ్ మా కే నామ్' చొరవ నుంచి ప్రేరణ పొందిన ఈ చర్య, పర్యావరణ పరిరక్షణకు వారి ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది' అని హైకమిషన్ తెలిపింది.


అంతేకాదు, UK హైకమిషన్ పెట్టిన మరొక పోస్ట్‌లో ఈ ఏడాది జులైలో ప్రధాని మోదీ.. UK పర్యటన సందర్భంగా కింగ్ చార్లెస్‌కు 'సోనోమా' (Sonoma) అనే మొక్కను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి

శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 19 , 2025 | 03:27 PM