SIT Raids on AP Liquor Scam: జగన్‌కు మరో బిగ్ షాక్.. ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు
ABN , Publish Date - Sep 19 , 2025 | 08:45 PM
ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన కంపెనీలు, ఇళ్లల్లో సిట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ లిక్కర్ స్కాం కేసు (AP Liquor Scam Case)లో సిట్ అధికారులు సోదాలు (SIT Officials Raids) ముమ్మరం చేశారు. వైఎస్ అనిల్ రెడ్డి (YS Anil Reddy)కి చెందిన కంపెనీలు, ఇళ్లల్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన 8 కంపెనీలు, రెండు ఇళ్లల్లో ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు సిట్ అధికారులు. చెన్నై, హైదరాబాద్‌లో ఏక కాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
సిలోహ్ ఇన్‌ఫ్రా, ఖన్నా ఎగ్జిమ్, సిలోహ్ ఇండస్ట్రీస్, ఫొర్రెస్ ఇంపెక్స్, ఇండో రాక్స్, వర్క్ ఈజీ స్పేస్, శ్రీ గోవిందరాజా మిల్స్, ట్రాన్సెల్ బయోలాజిక్స్ కంపెనీల్లో తనిఖీలు జరుగుతున్నాయి. చెన్నైలోని మైలాపూర్‌లోని నాలుగు కంపెనీల్లో టీ-నగర్, పెరుంగుడి, అరక్కు కొట్టైల్లోని మూడు కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
అలాగే చెన్నై ఆళ్వార్‌పేట, ఇజంబాకంలోని నివాసాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ అడ్రస్సుతో ఉన్న మరో కంపెనీ కార్యాలయంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి వైఎస్ అనిల్ రెడ్డి సమీప బంధువుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో వివిధ లావాదేవీల్లో అనిల్ రెడ్డి ప్రమేయం ఉందని అభియోగాలు వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.175కోట్ల విలువైన బంగారు నాణేలు ఎవరి కోసం?.. బ్లాక్ మనీని వైట్‌గా మార్చి..
జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు
Read Latest AP News And Telugu News