Share News

Pemmasani Fires on Jagan: జగన్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి.. పెమ్మసాని సెటైర్లు

ABN , Publish Date - Sep 13 , 2025 | 01:10 PM

వైసీపీ హయాంలో ఎయిమ్స్‌కు నీళ్లు, రోడ్లు ఇవ్వలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ మహిళా కళాశాలను కూడా కాపాడలేని అసమర్థత జగన్ ప్రభుత్వానిదని పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు.

Pemmasani Fires on Jagan:  జగన్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి.. పెమ్మసాని సెటైర్లు
Pemmasani Chandrasekhar Fires on Jagan

గుంటూరు జిల్లా, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (Jagan Mohan Reddy) కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) స్ట్రాంగ్ సవాల్ విసిరారు. జగన్‌కు చేతనైతే మెడికల్ కళాశాలల్లో టెండర్లు పాడుకొని.. అభివృద్ధి చేయాలని ఛాలెంజ్ విసిరారు. ఇవాళ(శనివారం) గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలను పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. ప్రజలను జగన్ ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు.. కానీ ప్రతిసారి మోసం చేయలేరని విమర్శించారు. గుంటూరు, రాజధాని ప్రజలు బాగా తెలివిగల వారని ప్రశంసించారు పెమ్మసాని చంద్రశేఖర్.


ఎవరికీ అధికారం ఇవ్వాలో ప్రజలకు బాగా తెలుసునని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో ఎయిమ్స్‌కు నీళ్లు, రోడ్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ మహిళా కళాశాలను కూడా కాపాడలేని అసమర్థత జగన్ ప్రభుత్వానిదని విమర్శించారు. జగన్ ఇష్టానుసారంగా మాట్లాడటం చూస్తే నవ్వు వస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలోనే మెడికల్ కళాశాలకు అనుమతి తీసుకున్నామని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు జగన్ ఏదో తానే కష్టపడి తెచ్చినట్లు మాట్లాడటం చూస్తుంటే విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సెటైర్లు గుప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో అమానుషం.. బీ ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్య

ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 13 , 2025 | 01:15 PM