Anitha Fires YSRCP: ఫేక్ వార్తలపై సాక్షి, వైసీపీకి.. హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Nov 05 , 2025 | 08:26 PM
కూటమి ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాయడంపై సాక్షి మీడియా, వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సాక్షి పత్రికలో ప్రైవేట్ స్కూల్ బాలికపై లైంగిక దాడి అని వార్త ఇచ్చారని.. అదే వార్తపై ఇవాళ బాలిక కాదు వివాహిత అని రాశారని అనిత మండిపడ్డారు.
అమరావతి, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంపై తప్పుడు వార్తలు (Fake News) రాయడంపై సాక్షి మీడియా, వైసీపీ (YSRCP)కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సాక్షి పత్రికలో ప్రైవేట్ స్కూల్ బాలికపై లైంగిక దాడి అని వార్త ఇచ్చారని.. అదే వార్తపై ఇవాళ(బుధవారం) బాలిక కాదు.. వివాహిత అని రాశారని మండిపడ్డారు. ఆ తర్వాత కూడా వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్‌లో బాలికపై లైంగిక దాడి అని ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ(బుధవారం) ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు హోంమంత్రి అనిత.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటపై కూడా వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలో కూడా కల్పిత వార్తలు రాసిందని ధ్వజమెత్తారు. బాలికల మాన ప్రాణాలు, చావుల మీద ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సద్విమర్శలు చేయాలి.. కానీ అబద్ధపు ప్రచారాలు వద్దని హితవు పలికారు. ప్రతి అంశంలోనూ సాక్షి, వైసీపీలు గోతికాడ నక్కలులాగా ఎదురుచూస్తున్నాయని ఎద్దేవా చేశారు. చాలా సెన్సిటీవ్ అంశాలకి సంబంధించి వైసీపీ, సాక్షి మీడియా తప్పుడు వార్తలు రాయడంపైన తాము చర్చించామని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
భారీ పెట్టబడులు, ఒప్పందాలకు విశాఖ వేదిక.. మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News