Share News

Telugu Film industry: ఏపీ ప్రభుత్వంతో సినిమా ప్రముఖుల భేటీ.. ఎందుకంటే

ABN , Publish Date - Aug 11 , 2025 | 10:51 AM

ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సమావేశం కానున్నారు. ఏపీ సచివాలయంలో ఈ భేటీ జరుగనుంది. తెలుగు ఫిలింఫెడరేషన్ స్ట్రైక్, వారి సమస్యలపై ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేశ్‌తో ప్రధానంగా చర్చించనున్నారు.

Telugu Film  industry: ఏపీ ప్రభుత్వంతో సినిమా ప్రముఖుల భేటీ.. ఎందుకంటే
Telugu Film Industry Meet Kandula Durgesh

అమరావతి, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో (Minister Kandula Durgesh) తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు (Telugu Film Chamber Association) ఇవాళ(సోమవారం) సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.00 గంటలకు ఏపీ సచివాలయంలో ఈ భేటీ జరుగనుంది. తెలుగు ఫిలింఫెడరేషన్ స్ట్రైక్, వారి సమస్యలపై ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేశ్‌తో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు సినీ ప్రముఖులు నాగవంశీ, బన్నీ వాసు, పలువురు సినీ ప్రముఖులు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏపీ సచివాలయానికి సినీ ప్రముఖులు బయలుదేరి వెళ్లారు.


భేటీలో పాల్గొనే వారి వివరాలు.

1. దిల్ రాజ్

2. కేఎల్ నారాయణ

3. ⁠మైత్రీ రవిబాబు

4. ⁠విశ్వప్రసాద్

5. ⁠నాగవంశీ

6. సాహు

7. చెర్రీ

8. భరత్ - తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు

9. స్వప్నా - వైజయంతి

10. వంశీ – యూవీ క్రియేషన్స్

11. వివేక్

12. దానయ్య

13. ⁠బీవీఎస్ఎన్ ప్రసాద్

14. బన్నీ వాసు


ఎనిమిదో రోజుకు సినీ కార్మికుల సమ్మె

మరోవైపు.. తెలుగు సినీ కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. నిర్మాతల ప్రతిపాదనలను, కొన్ని యూనియన్‌లకు వారు ప్రకటించిన పర్సంటేజ్ విధానాన్ని కార్మికుల ఫెడరేషన్ ఒప్పుకోలేదు. రోజువారి వేతనాలను తీసుకునే 13 యూనియన్‌లకు వేతన పెంపు ఉండాలని సినీ కార్మికుల ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈరోజు(సోమవారం) తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఫెడరేషన్ సభ్యులు కలిసే అవకాశాలు ఉన్నాయి. వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా మంత్రి సూచనలు చేయాలని ఫెడరేషన్ లీడర్స్ కోరనున్నారు. నిర్మాత విశ్వప్రసాద్ నోటీసుల గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం యువ నిర్మాతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సినిమా నిర్మాణం, విడుదల పరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను నిర్మాతలు వెల్లడించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో జగన్‌ మేనమామ రాజకీయం

ఏపీలో తెలంగాణ మంత్రులు

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 02:32 PM