Share News

Undavalli Arun Kumar: టెర్రరిస్టులను కాల్చి పడేయాలి: ఉండవల్లి

ABN , Publish Date - Dec 06 , 2025 | 02:52 PM

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలు ఎందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయాన్ని, జగన్ భారతి సిమెంట్స్‌ను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని సూచించారు.

Undavalli Arun Kumar: టెర్రరిస్టులను కాల్చి పడేయాలి: ఉండవల్లి
Undavalli Arun Kumar

రాజమహేంద్రవరం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కోనసీమ కొబ్బరికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) స్పందించారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ వ్యాఖ్యానించడం సరికాదని హితవు పలికారు. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడని తాను నమ్మిన పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. ఇవాళ (శనివారం) రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు ఉండవల్లి అరుణ్ కుమార్.


ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలను ఎందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం లేదని ప్రశ్నించారు ఉండవల్లి. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయాన్ని, జగన్ భారతి సిమెంట్స్‌ను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబులది రాజకీయ స్నేహం మాత్రమేనని.. వారి మనస్సులు ఎప్పుడూ కలవవని విమర్శించారు.


ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ వర్ధంతి అని తెలిపారు. ప్రభుత్వానికి అపరిమిత హక్కులు కల్పించి ప్రజలు మౌనంగా ఉన్నప్పుడు దేశానికి పతనం మొదలవుతోందని అంబేడ్కర్ చెప్పారని గుర్తుచేశారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలు మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. పాంచజన్యం పుస్తకం చదివిన తర్వాత ఆర్ఎస్ఎస్‌లో నుంచి తాను బయటకు వచ్చానని స్పష్టం చేశారు. హిందూమతంపై 1964లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారని ప్రస్తావించారు. హిందుత్వం అనేది మతం కాదని.. సనాతన ధర్మమని వివరించారు. బీజేపీ నేతలు రాజకీయం కోసం హిందూ మతాన్ని వాడుకుంటున్నారని విమర్శలు చేశారు. నార్త్ తరహాలో ఏపీలో బీజేపీ ఎప్పుడూ బలపడదని పేర్కొన్నారు. భారత్‌లో అమాయకుల జోలికి వచ్చే పాకిస్థాన్ టెర్రరిస్టులను కాల్చి పడేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 06 , 2025 | 03:38 PM