TTD Chairman BR Naidu: సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ పరువు నష్టం దావా
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:04 PM
టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులో తెలిపారు. సాక్షి మీడియా తక్షణమే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
తిరుమల,ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులో తెలిపారు. సాక్షి మీడియా తక్షణమే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తాను తొమ్మిది నెలల నుంచి పనిచేస్తున్నానని తెలిపారు బీఆర్ నాయుడు.
రెండు లక్షల మందికి అన్నదానం..
తిరుమల కొండపై అన్న ప్రసాదం సుమారు రోజుకు రెండు లక్షల మంది సేవిస్తున్నారని వివరించారు. అన్న ప్రసాదంలో వడలాంటి కొత్త పదార్థాలను చేర్చామని వెల్లడించారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో కూడా అన్న ప్రసాదం సరఫరా జరుగుతోందని తెలిపారు. తిరుపతిలో స్థానికంగా ఉన్నవాళ్లకి నెలకు ఒకసారి శ్రీవారి దర్శనం గతంలో ఉండేదని.. మళ్లీ ఆ దర్శనాన్ని తాము పునరుద్ధరించామని చెప్పుకొచ్చారు. టీటీడీలో అన్యమతస్థులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లని వేరే డిపార్ట్‌మెంట్‌కి పంపించామని.. కొంతమందికి వాలంటరీ రిటైర్ట్‌మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు బీఆర్ నాయుడు.
టీటీడీలో అన్యమతస్థులపై చర్యలు...
టీటీడీలో అన్యమతస్థులపై ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుమల కొండపైన క్యాంటీన్‌లను వైసీపీ నేతలు తీసుకొని మాఫియాలాగా చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవాణి దర్శనం సమయం మార్చామని.. ఉదయం నుంచి రాత్రి వరకు కాకుండా వెంటనే జరిగేలా చూశామని వెల్లడించారు. వీఐపీ దర్శన టైమింగ్ కూడా మార్చామని తద్వారా సామాన్యులకు దర్శనం సులువు అవుతుందని వివరించారు. అలిపిరి వద్ద భద్రత కొంత ఆలస్యం అవుతుందని.. వాటి కోసం కొత్త ఎక్విప్‌మెంట్ సమకూర్చుకుంటున్నామని చెప్పుకొచ్చారు. టీటీడీ పేరిట నకిలీ వెబ్‌సైట్‌లను పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా టీటీడీ దేవాలయాలు ఉండాలని.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విన్నవించామని గుర్తుచేశారు బీఆర్ నాయుడు.
కొత్త దేవాలయాల నిర్మాణం...
టీటీడీలో మత మార్పిడిని నివారించడానికి కృషి చేస్తున్నామని.. అందుకు కొత్త దేవాలయాలు నిర్మించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారం కోసం ప్రత్యేక పుస్తకాన్ని భక్తులకు ఇస్తున్నామని వెల్లడించారు. సిమ్స్‌లో 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. శ్రీవారి ప్రసాదం నాణ్యత కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాము ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్న కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సాక్షి మీడియా హిందూ మతం మీద దాడి చేస్తోందని ఫైర్ అయ్యారు బీఆర్ నాయుడు.
హిందూ ధర్మం అంటే జగన్‌కు పడదు..
జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఎప్పుడైనా తిరుపతికి వచ్చి శ్రీవారికి తలనీలాలు ఇచ్చారా..? వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిన్నారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూ ధర్మం అంటే వారికి పడదని.. అందుకే దాడులు చేస్తున్నారని.. వారు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. తాము తప్పు చేస్తే చెప్పాలి కానీ ఇలా నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. మీరు ఎవరితో అయినా పెట్టుకోండి తనతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. తన మీద దాడి చేయండి.. కానీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అసత్య ప్రచారం చేయొద్దని హితవు పలికారు. వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి అవినీతి సామ్రాట్, డెకాయిట్ అని ఆరోపించారు. రూ.1600 వందల కోట్లు టెండర్లు ఇచ్చి పది శాతం పర్సెంట్ తీసుకున్నారని బీఆర్ నాయుడు విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్..
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News