Bhanu Prakash Reddy: కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనం విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధం
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:22 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ చేశారు.
తిరుపతి, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ చేశారు. శ్రీవారి ఆలయంలో జరిగిన వ్యవహారంపై జగన్ ఎగతాళిగా ఎలా మాట్లాడుతారని ధ్వజమెత్తారు. మీ దేవుడు విషయంలో ఇలాగే వ్యవహరిస్తారా..? అని ప్రశ్నించారు. పరకామణిలో జరిగిన దొంగతనాన్ని వెనుకేసుకురావడం జగన్‌కు తగదని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) తిరుపతి వేదికగా మీడియాతో మాట్లాడారు భానుప్రకాశ్ రెడ్డి.
వేంకటేశ్వరస్వామితో తాము రాజకీయం చేయడం లేదని... వైసీపీ ప్రభుత్వంలోనే దేవుడును రాజకీయంగా వాడుకున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యి విచారణలో దర్యాప్తు జరుగుతోందని.. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. స్వామి వారికి నిత్యం భక్తులు దర్శనం తర్వాత కానుకలు సమర్పిస్తారని తెలిపారు. పరకామణి గురించి జగన్ చులకనగా మాట్లాడటం తగదని పేర్కొన్నారు. శ్రీవారి ఖజానాలో దొంగతనం జరిగితే చిన్న చోరీ అని ఎలా అంటారని ప్రశ్నించారు. హిందువుల మనసు గాయపడే విధంగా జగన్ మాట్లాడారని ఫైర్ అయ్యారు భానుప్రకాశ్ రెడ్డి.
పరకామణి చోరీ తర్వాత జరిగిన పరిణామంలో జగన్‌కు కూడా వాటా ఉందా అని ప్రశ్నించారు. ఇక నుంచి దొంగతనాలు చేసిన వారు కూడా ఆయన వద్దకు పోతే రాజీ చేయిస్తారా అని ఎద్దేవా చేశారు. ప్రజా నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడుతారా అని ఫైర్ అయ్యారు. జగన్‌కు ఇందులో వాటా ఉండబట్టే రాజీ జరిగిందని అర్థమవుతోందని ఆరోపించారు. దేవుడును అడ్డం పెట్టుకునే రాజకీయాలు తాము చేయమని స్పష్టం చేశారు. వైవీ సుబ్బారెడ్డి గోపూజ చేస్తారని చెబుతున్నారని.. మరీ కల్తీ నెయ్యి వాడినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. సిట్ అధికారులను విమర్శించడం సరికాదని అన్నారు. పోలీస్ అధికారులకు వెంటనే జగన్ క్షమాపణ చెప్పాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన ప్రకటన
Read Latest AP News and National News