Share News

Ayyannapatrudu Criticizes on Jagan: జగన్‌కు అయ్యన్నపాత్రుడు చురకలు

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:57 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.

Ayyannapatrudu Criticizes on Jagan: జగన్‌కు అయ్యన్నపాత్రుడు చురకలు
Ayyannapatrudu Criticizes on YS Jagan

తిరుపతి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)కి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) చురకలు అంటించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీకి కనీసం 50 రోజులైనా హాజరు కావాలనే నిబంధన తప్పనిసరి చేయాలని చెప్పుకొచ్చారు. సభకు హాజరుకాకుండా ప్రభుత్వం గురించి జగన్ మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు అయ్యన్నపాత్రుడు.


ఇవాళ(ఆదివారం) తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో అయ్యన్నపాత్రుడు పాల్గొని మాట్లాడారు. తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో మహిళా సాధికారిక సదస్సు జరగడం మంచి పరిణామమని ఉద్ఘాటించారు. మహిళలకు తండ్రి ఆస్తిలో సగం వాటా ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌నేనని నొక్కిచెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు మహిళల ఆస్తి హక్కు గురించి చట్టం చేశారని గుర్తుచేశారు అయ్యన్నపాత్రుడు.


ఉద్యోగాల్లో మహిళలకు ఎన్టీఆర్ రిజర్వేషన్ తీసుకువచ్చారని ఉద్ఘాటించారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలను బలోపేతం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని నొక్కిచెప్పారు. ఒక మహిళను అసెంబ్లీకి స్పీకర్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్.. మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని తెలిపారు. తిరుపతిలో మహిళా యూనివర్సిటీని పెట్టింది కూడా ఎన్టీఆరేనని గుర్తుచేశారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్‌గా వంగలపూడి అనితను పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు సీఎం చంద్రబాబు స్థానం కల్పించారని ఉద్ఘాటించారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

నవయువతకు ప్రేరణ.. అబ్బురపరుస్తున్న దుర్గేశ్‌ విన్యాసాలు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 14 , 2025 | 03:57 PM