Share News

Kunamneni Sambasivarao: వయనాడ్‌ నుంచి రాహుల్ పోటీ సరైంది కాదు

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:38 PM

Telangana: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయటం సరైంది కాదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వయనాడు లోక్‌సభ స్థానం సీపీఐది అని.. రాహుల్ గాంధీ మిత్రధర్మం పాటించాలని సూచించారు. పొత్తులో భాగంగా తెలంగాణలో సీపీఐకు ఒక లోక్‌సభ స్థానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మం పాటిస్తోందని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Kunamneni Sambasivarao: వయనాడ్‌ నుంచి రాహుల్ పోటీ సరైంది కాదు

హైదరాబాద్, మార్చి 9: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) వయనాడ్ (Wayanad) నుంచి పోటీ చేయటం సరైంది కాదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు (CPI Leader Kunamneni Sambashivarao) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వయనాడు లోక్‌సభ స్థానం సీపీఐది అని.. రాహుల్ గాంధీ మిత్రధర్మం పాటించాలని సూచించారు. పొత్తులో భాగంగా తెలంగాణలో సీపీఐకు ఒక లోక్‌సభ స్థానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మం పాటిస్తోందని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Congress: కాంగ్రెస్‌ తొలిజాబితాలో ఏడుగురికి చోటు.. బెంగళూరు గ్రామీణ నుంచి మరోసారి డీకే సురేశ్‌


కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project_ విషయంలో బీఆర్ఎస్ (BRS) ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు. నిపుణుల కమిటీ నివేదికను నెల రోజుల్లో ఇవ్వాలన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చి హడావుడి చేయటం ప్రధాని మోదీ (PM Modi) స్ట్రాటజీ అంటూ వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ (Narendra Modi) కనికరంలేని రాజకీయ నాయకుడని మండిపడ్డారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు వస్తున్నారా? లేక రాజకీయ సభల్లో పాల్గొనేందుకు వస్తున్నారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని పెద్దన్న కొనియాడితే.. మోదీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర విమర్శలు చేశారన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తారా లేదా ఎన్నికల ముందే చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి పరిష్కారం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. బీఎస్ఎస్‌లో మొన్నటికి, ఇవాల్టికి ఏమార్పు వచ్చిందో ప్రవీణ్ కుమార్ చెప్పాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి...

YCP: ఉత్తరాంధ్ర నేతలతో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి సమావేశం.. ఆంతర్యమేంటో..!

Kadapa: ఇదేం అరాచకం.. దస్తగిరి తండ్రివి నీవేనా అంటూ దాడి!


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 09 , 2024 | 01:38 PM