Share News

Viral Video: ఈ వధువు చాలా స్మార్ట్ గురూ..! చుట్టూ అంతా ఉన్నా.. వరుడిని బురిడీ కొట్టించిందిగా..

ABN , Publish Date - May 25 , 2024 | 04:54 PM

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటుచేసుకుంటుంటే.. మరికొన్నిసార్లు సరదా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మొత్తానికి పెళ్లికి సంబంధించిన ఎలాంటి సంఘటన అయినా ఇట్టే నెట్టింట వైరల్ అవుతుంటుంది. తాజాగా..

Viral Video: ఈ వధువు చాలా స్మార్ట్ గురూ..! చుట్టూ అంతా ఉన్నా.. వరుడిని బురిడీ కొట్టించిందిగా..

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటుచేసుకుంటుంటే.. మరికొన్నిసార్లు సరదా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మొత్తానికి పెళ్లికి సంబంధించిన ఎలాంటి సంఘటన అయినా ఇట్టే నెట్టింట వైరల్ అవుతుంటుంది. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చుట్టూ బంధువులంతా ఉన్నా కూడా వధువు చేసిన ఓ చిలిపి పని అందరినీ ఆకట్టుకుంటోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వివాహ వేదికపై దండలు మార్చుకున్న వధూవరులు (bride and groom) పక్క పక్కనే కూర్చుని ఉండగా.. బంధువులంతా ఒక్కొక్కరుగా వచ్చి ఆశీర్వదిస్తుంటారు. ఈ సందర్భంగా కొందరు గిఫ్ట్‌లు, మరికొందరు నగదును అందజేస్తుంటారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది.

Viral Video: వామ్మో..! వంట గదిలో ఈ రోబో చేసిన పని చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..


వధూవరుల దగ్గరికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఓ వ్యక్తి వారి చేతికి కరెన్సీ నోట్లను అందిస్తాడు. అయితే వరుడి చేతిలో ఉన్న డబ్బులపై వధువు కన్నేస్తుంది. ఎలాగైనా అందులో నోటును కొట్టేయాలని ప్రయత్నిస్తుంది. వరుడు పరధ్యానంలో ఉండడం చూసి మెల్లగా చేయి దగ్గరికి పెట్టి, (bride stole the cash) వరుడి చేతిలో ఉన్న నోట్లలో వంద నోటును లాక్కుంటుంది. వధువు చేసిన ఈ పని తెలిసినా కూడా వరుడు తెలియనట్లుగా నటిస్తాడు.

Viral Video: వామ్మో..! ఏంటయ్యా ఇదీ.. ఈ వ్యక్తి రాగానే చుట్టూ చేరిన చేపలు.. చివరకు..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదంతా వ్యూస్ కోసం కావాలని ఇలా చేశారని తెలుస్తున్నా కూడా.. వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వధువు చాలా స్మార్ట్ గురూ’’.. అంటూ కొందరు, ‘‘వరుడిని బురుడీ కొట్టించిన వధువు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 79వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కోతి ఎన్నాళ్ల నుంచి వెంటాడుతుందో ఏమో గానీ.. ఇంట్లో పడుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి మరీ..

Updated Date - May 25 , 2024 | 04:54 PM