Share News

Viral Video: వామ్మో..! వంట గదిలో ఈ రోబో చేసిన పని చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..

ABN , Publish Date - May 25 , 2024 | 04:11 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రోబోల ప్రాధాన్యత ఎంతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరకు హోటల్లో ఫుడ్ డెలివరీ కూడా రోబోలో చేసి పడేస్తున్నాయి. ఇలా అనేక రంగాల్లో రోబోల పాత్ర కీలకంగా మారింది. ఇందుకు..

Viral Video: వామ్మో..! వంట గదిలో ఈ రోబో చేసిన పని చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రోబోల ప్రాధాన్యత ఎంతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరకు హోటల్లో ఫుడ్ డెలివరీ కూడా రోబోలో చేసి పడేస్తున్నాయి. ఇలా అనేక రంగాల్లో రోబోల పాత్ర కీలకంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వంట గదిలో రోబో చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వంట గదిలో ఓ రోబో చెఫ్ (Robot Cooking in Kitchen) అవతారం ఎత్తింతి. అచ్చం మనుషుల్లాగానే చేతిలో గరిటె పట్టుకుని తన పాక ప్రావీణ్యాన్ని బయటపెట్టింది. ఓ పెద్ద పెనంలో అనేక రకాల పదార్థాలను వేసి, వాటిని వేయించేందుకు సిద్ధమైంది. ముందుగా పెనాన్ని స్టవ్‌పై వేడి చేసి, తర్వాత అందులో సిద్ధంగా ఉంచుకున్న పదార్థాలను వేసి బాగా మిక్స్ చేసింది. వేయించే సమయంలో పదార్థాలన్నీ బాగా మిక్స్ అయ్యేలా.. ఓచేత్తో పెనాన్ని అటూ ఇటూ తిప్పుతూ, మరో చేతిలోని గరిటెతో కొడుతూ అచ్చం మనుషుల్లాగానే చేసింది.

Viral Video: వామ్మో..! ఏంటయ్యా ఇదీ.. ఈ వ్యక్తి రాగానే చుట్టూ చేరిన చేపలు.. చివరకు..


వంట మొత్తం సిద్ధం కాగానే పెనాన్ని కిందకు దించి, అందులోని ఆహార పదార్థాలను ఓ ప్లేటులోకి తీసింది. వంట చేసే క్రమంలో రోబో డాన్స్ వేస్తూ, ఆ పనిని ఎంజాయ్ చేస్తూ వంట చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది రోబో చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘అచ్చం మనుషుల్లాగానే వంట చేస్తోంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది గ్రాఫిక్స్ అని ఈజీగా తెలిసిపోతోంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం 39 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది మామూలు తెలివికాదురోయ్..! స్టాండింగ్ ఫ్యాన్‌తో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే.. వారెవ్వా.. అనాల్సిందే..

Updated Date - May 25 , 2024 | 04:11 PM