Share News

Viral Video: చూసేందుకు జిరాక్స్ మిషిన్‌లా ఉందేంటని అనుకుంటున్నారా.. ఇందులో బట్టలు వేస్తే.. చివరకు..

ABN , Publish Date - May 24 , 2024 | 08:16 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన ఇంట్లో వినూత్నమైన మిషిన్‌ను వాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ యువతి ఉతికిన దుస్తులన్నింటినీ ఓ మిషిన్ వద్దకు తీసుకొస్తుంది. చూసేందుకు..

Viral Video: చూసేందుకు జిరాక్స్ మిషిన్‌లా ఉందేంటని అనుకుంటున్నారా.. ఇందులో బట్టలు వేస్తే.. చివరకు..

టెక్నాలజీ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది. దీంతో మరోవైపు రాను రాను మనిషికి శ్రమ తగ్గిపోతోంది. దాదాపు మనుషులు చేసే పనులన్నీ యంత్రాలే చేసేస్తున్నాయి. దీనివల్ల పది మంది చేసే పనిని కూడా ఒకే ఒక్క చిన్న యంత్రం సింపుల్‌గా చేసేపడేస్తుంటుంది. కొన్ని మిషిన్లు చేసే పనులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి విచిత్ర యంత్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చూసేందుకు జిరాక్స్ మెషిన్‌లా ఉన్న యంత్రంలో బట్టలు వేయడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన ఇంట్లో వినూత్నమైన మిషిన్‌ను (innovative machine) వాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ యువతి ఉతికిన దుస్తులన్నింటినీ ఓ మిషిన్ వద్దకు తీసుకొస్తుంది. చూసేందుకు జిరాక్స్ మిషిన్‌లా ఉన్నా ఈ యంత్రం పై భాగాన.. చొక్కాలు, టీ షర్ట్‌లను ఒక్కొక్కటిగా పెడుతుంది. దుస్తులను ఇలా పెట్టగానే.. మిషిన్ వాటిని టక్కున లోపలికి తీసుకుంటుంది. ఇలా ఆమె వరుసగా రెండు టీ షర్ట్‌లు, ఒక చొక్కాను అందులో పెడుతుంది. వాటిని లోపలికి తీసుకున్న యంత్రం.. (Clothes folding machine) కాసేపటి తర్వాత చక్కగా మడతపెడుతుంది.

Viral Video: ఇది మామూలు తెలివికాదురోయ్..! స్టాండింగ్ ఫ్యాన్‌తో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే.. వారెవ్వా.. అనాల్సిందే..


ఆ తర్వాత యంత్రం కింద భాగం నుంచి అవి బయటికి వస్తాయి. ఇలా ఆమె సింపుల్‌గా చొక్కాలన్నింటినీ సులభంగా మడతపెట్టేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే.. ఈ మిషిన్ చాలా విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘చొక్కాలు మడతపెట్టేందుకు ఈ విషిన్ చాలా సమయం తీసుకుంటోంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలా చేయడం కంటే మనమే మడతపెడితే త్వరగా అయిపోతుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. పచ్చి మామిడిని క్షణాల్లో పండుగా ఎలా మార్చాడంటే..

Updated Date - May 24 , 2024 | 08:16 PM