Share News

Viral Video: ఈత కొట్టేందుకు మొసళ్ల చెరువులోకి దూకిన బాలుడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - May 24 , 2024 | 03:45 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు ఈత కొట్టేందుకు ఏకంగా పిల్ల మొసళ్లు ఉన్న నీటి వద్దకు వెళ్లాడు. ఒడ్డున నిలబడి కాసేపు వాటిని గమనించాడు. తర్వాత..

Viral Video: ఈత కొట్టేందుకు మొసళ్ల చెరువులోకి దూకిన బాలుడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే..

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుంతుంటుంది. కొందరు పులులు, సింహాలు, మొసళ్లతో చిన్నపిల్లల తరహాలో ఆటలు ఆడుకోవడం చూస్తుంటాం. ఇంకొందరు వాటితో వివిధ రకాల విన్యాసాలు కూడా చేస్తుంటారు. తాజాగా, ఓ బాలుడు చేసిన సాహసం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. మొసళ్లు ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు దూకేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు (boy) ఈత కొట్టేందుకు ఏకంగా పిల్ల మొసళ్లు (crocodiles) ఉన్న నీటి వద్దకు వెళ్లాడు. ఒడ్డున నిలబడి కాసేపు వాటిని గమనించాడు. తర్వాత ఒక్క ఉదుటున నీటిలోకి దూకేశాడు. బాలుడు నీటిలోకి దూకగానే మొసళ్లన్నీ దూరంగా పారిపోతాయి. తర్వాత ఒక్కొక్కటిగా అతడి వద్దకు వస్తాయి. అయినా అతను ఏమాత్రం భయం లేకుండా వాటితో కలిసి (swimming) ఈత ఆడేస్తాడు.

Viral Video: హోటల్లో ఇవేం పనులురా బాబోయ్.. వంట గదిలో ఇతడి నిర్వాకం చూస్తే..


ఈ క్రమంలో కొన్ని మొసలి పిల్లలు అతడి శరీరం పైకి ఎక్కుతుంటాయి. మరికొన్ని అతడిపై అలాగే ఉండిపోతాయి. అయినా వాటిలో ఒక్కటి కూడా అతడికి హాని చేయదు. ఇలా ఆ బాలుడు చాలా సేపు మొసలి పిల్లలతో ఈత కొడతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ పిల్లాడికి ధైర్యం ఎక్కువే’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వధువు ఎదుటే యువతితో సెల్ఫీ దిగాడు.. చివరకు ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో ఖంగుతిన్నాడు..

Updated Date - May 24 , 2024 | 03:45 PM