Share News

Viral Video: హోటల్లో ఇవేం పనులురా బాబోయ్.. వంట గదిలో ఇతడి నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - May 23 , 2024 | 09:24 PM

హోటళ్లలో వంటలు చేసే సమయంలో శుభ్రత పాటించకపోవడం తరచూ చూస్తూ ఉంటాం. నాణ్యత లేని ఆహారం పదార్థాలను తయారు చేయడం, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వడ్డించడం కూడా చూస్తుంటాం. అధికారుల తనిఖీల్లో..

Viral Video: హోటల్లో ఇవేం పనులురా బాబోయ్.. వంట గదిలో ఇతడి నిర్వాకం చూస్తే..

హోటళ్లలో వంటలు చేసే సమయంలో శుభ్రత పాటించకపోవడం తరచూ చూస్తూ ఉంటాం. నాణ్యత లేని ఆహారం పదార్థాలను తయారు చేయడం, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వడ్డించడం కూడా చూస్తుంటాం. అధికారుల తనిఖీల్లో ఇలాంటి ఉదంతాలు తరచూ ఎక్కడో చోట వెలుగుచూస్తూనే ఉంటాయి. అయితే తాజాగా, ఓ హోటల్లో సిబ్బంది చేస్తున్న నిర్వాకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వంట గదిలో సిబ్బంది చేస్తున్న పని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబైలో (Mumbai) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కుర్లా వెస్ట్ ఎల్‌బిఎస్ రోడ్‌లోని కల్పనా థియేటర్ సమీపంలో ఇస్తాంబుల్ దర్బార్ అనే హోటల్ (Hotel) ఉంది. ఈ హోటల్‌కి కస్టమర్ల తాకిడి అధికంగా ఉంటుంది. అయితే ఇటీవల ఈ హోటల్‌కి సంబంధించిన వీడియో అంతా అవాక్కయ్యేలా చేస్తోంది. హోటల్ వంట గదిలో పని చేస్తున్న వ్యక్తి.. అక్కడి డ్రైనేజీ (Drainage) ఎత్తేస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. డ్రైనేజీ ఎత్తేయడానికి అతను ఫ్రైయింగ్ నెట్‌ని (Frying net) ఉపయోగించాడు. ఫ్రైయింగ్ నెట్‌తో డ్రైనేజీలోని మురికిని మొత్తం తీసి, పక్కన పడేస్తున్నాడు. ఇతడు చేస్తున్న పనిని దూరం నుంచి గమనించిన కొందరు.. వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: సరసాలు ఆడబోయిన సింహానికి షాక్.. ఆడ సింహాన్ని నిద్ర లేపాలని చూడడంతో...


ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు హోటల్ యజమాని స్పందించాడు. తమ హోటల్లో ఫ్రైయింగ్ నెట్‌తో మురుగు ఎత్తేస్తున్నట్లుగా ఉన్న వీడియో చూసి ఎవరూ నమ్మొద్దని చెప్పారు. అతను ఉపయోగించిన వస్తువు.. కేవలం మురుగు శుభ్రం చేసేందుకు మాత్రమే కేటాయించామని సమాధానం ఇచ్చాడు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అది నిజంగానే ఫ్రైయింగ్ నెట్‌లా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘కళ్లతో చూసినందతా నిజం కాకపోవచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వధువు ఎదుటే యువతితో సెల్ఫీ దిగాడు.. చివరకు ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో ఖంగుతిన్నాడు..

Updated Date - May 23 , 2024 | 09:37 PM